Andhra Pradesh: వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తాం.. చంద్రబాబు సంచలన ప్రకటన

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విభేదాలు లేకుండా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.

New Update
CM Chandra babu

CM Chandra babu

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విభేదాలు లేకుండా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ నేపథ్యంలో శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేశారని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి ప్రజలపై భారం మోపారంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము హామీ ఇచ్చిన పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. రాజధాని అమరావతిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రపంచం మెచ్చుకునేలా మారుస్తామని తెలిపారు. తమ ప్రభుత్వంలోని మూడు పార్టీల్లో కూడా చాలమంది కొత్త సభ్యులు వచ్చారన్నారు. గత ప్రభుత్వంపై పోరాడిన వాళ్లలో చాలామందికి సీట్లు ఇచ్చామని. తాము బరిలోకి దింపిన వాళ్లలో 94 శాతం గెలిచారని తెలిపారు. 

ప్రస్తుతం రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదని.. అది ప్రజలే ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో వైసీపీకి విపక్ష హోదాకు తగ్గట్లు జనం కనీస సీట్లు ఇవ్వలేదని సెటైర్లు వేశారు. కానీ ఇప్పటికి వైసీపీ నేతలు ఎలాంటి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisment
తాజా కథనాలు