Trump: రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపై ట్రంప్ సంచలన ప్రకటన

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ట్రంప్ స్పందించారు. ఇంటర్నేషనల్ చమురు మార్కెట్లపై ఒత్తిడి తగ్గించడం కోసం భారత్‌కు రష్యా నుంచే కొనుగోలు చేసేలా తాత్కాలిక పర్మిషన్ ఇచ్చామన్నారు.

New Update
Trump On Easing Oil Prices After Russian Waiver To India

Trump On Easing Oil Prices After Russian Waiver To India

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై స్పందించారు. ఇంటర్నేషనల్ చమురు మార్కెట్లపై ఒత్తిడి తగ్గించడం కోసం భారత్‌కు రష్యా నుంచే కొనుగోలు చేసేలా తాత్కాలిక పర్మిషన్ ఇచ్చామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో చమురు సరఫరా మార్గాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. 

Also Read: ఇరాన్ సుప్రీం లీడర్ ఖరారు.. పేరు రహస్యంగా ఉంచిన అసెంబ్లీ.. ఉత్కంఠలో ప్రపంచ దేశాలు!

కొంత ఒత్తిడి తగ్గేంచుకు నేను ప్రయత్నిస్తున్నానని.. మా దేశంలో చమురు భారీగా ఉందని తెలిపారు. బయటి దేశాల్లో కూడా చమురు ఉందన్నారు. చమురు సరఫరా సమస్య త్వరలోనే సర్దుకుంటుందని తెలిపారు. ఇదిలాఉండగా రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా-భారత్‌ మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేసి ఆ దేశానికి సపోర్ట్ చేస్తోందని అమెరికా ఆరోపణలు చేసింది. 

Also read: ట్రంప్ ముందు 2 ప్లాన్స్.. ఇరాన్ యురేనియం కోసం రంగంలోకి అమెరికా స్పెషల్ కమాండోలు?

ఇరుదేశాల మధ్య శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా భారత్‌ చర్యల వల్ల దెబ్బతింటున్నాయని విమర్శించింది. మరోవైపు  అమెరికాలో ప్రజలు, వ్యాపారాలు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని ట్రంప్ ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆదివారం సంతకం చేశారు. 

Advertisment
తాజా కథనాలు