/rtv/media/media_files/2026/03/09/supreme-court-2026-03-09-18-31-39.jpg)
Supreme Court Asks States and UTs To Frame Policy To Provide All Acid Attack Victims Govt Jobs
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. యాసిడ్ దాడి బాధితులకు పరిహారం కల్పించే విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్లందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం కుదరకుంటే బాధితుల జీవనాధారం కోసం భత్యం చెల్లించేలా విధానాలు రూపొందిచాలని సూచనలు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే 10 లక్షల కోట్లు నష్టం
అంతేకాదు యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ విభాగాల్లో/ఏజెన్సీల్లో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేరో సరైన కారణాలు తెలియజేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా గతంలో కూడా యాసిడ్ దాడుల కేసులపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దాడులకు పాల్పడ్డ నేరగాళ్లకు కఠినమైన శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలని కేంద్రానికి సూచించింది. దోషుల ఆస్తులను కూడాఎందుకు స్వాధీనం చేసుకోకూడదంటూ ప్రశ్నించింది. అయితే తాజాగా హర్యానాకు చెందిన ఓ యాసిడ్ దాడి బాధితురాలి పిటషన్‌పై విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు యాసిడ్ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆదేశించింది.
Also Read: గ్యాస్ వినియోగదారులకు షాక్.. సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు!
Follow Us