/rtv/media/media_files/2025/06/01/jGiikIRz2AvVV61vqP8V.jpg)
LPG Cylinder Price Drop Photograph: (LPG Cylinder Price Drop)
వంట గ్యాస్ (LPG) వినియోగదారులకు చమురు సంస్థలు షాకిచ్చాయి. గ్యాస్ సిలిండర్ల(lpg-gas-cylinders) బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ కొత్త నిర్ణయాలు తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కొత్త రూల్స్ మార్చి 6, 2026 (శుక్రవారం) నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం, ఒక గ్యాస్ సిలిండర్ తీసుకున్న 15 రోజుల తర్వాత రెండో సిలిండర్ బుక్(gas cylinder booking) చేసుకునే అవకాశం ఉండేది. అయితే, తాజా మార్పుల ప్రకారం ఈ కనీస గడువును 21 రోజులకు పెంచారు. అంటే, ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత, తదుపరి బుకింగ్ చేసుకోవాలంటే కనీసం మూడు వారాల గ్యాప్ ఉండాలి. దీనికి అనుగుణంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉన్న సాఫ్ట్‌వేర్‌ను కూడా ఇప్పటికే అప్డేట్ చేశారు. 21 రోజులు పూర్తి కాకముందే బుక్ చేయడానికి ప్రయత్నిస్తే సిస్టమ్ అంగీకరించదు.
Also Read : లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. నేడు పార్లమెంట్లో హై టెన్షన్
ఏడాదికి 15 సిలిండర్ల పరిమితి
కేవలం బుకింగ్ గ్యాప్ మాత్రమే కాకుండా, ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు) ఒక కనెక్షన్‌పై పొందే సిలిండర్ల సంఖ్యపై కూడా స్పష్టతనిచ్చారు. ఒక ఏడాదిలో ఒక కనెక్షన్‌పై గరిష్టంగా 15 సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఈ 15 సిలిండర్లలో మొదటి 12 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. మిగిలిన 3 సిలిండర్లను వినియోగదారులు సబ్సిడీ లేకుండా (నాన్-సబ్సిడీ ధరపై) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
OTP/DAC వెరిఫికేషన్ తప్పనిసరి
సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారుడు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (DAC) లేదా OTPని డెలివరీ బాయ్‌కు చెప్పడం తప్పనిసరి. ఈ కోడ్ చెబితేనే డెలివరీ పూర్తయినట్లు సిస్టమ్‌లో నమోదవుతుంది.
ఇ-కేవైసీ (e-KYC)
గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి వినియోగదారుడు ఇ-కేవైసీ పూర్తి చేయడం ఇప్పుడు తప్పనిసరి. కేవైసీ పూర్తి చేయని వారికి సబ్సిడీ ఆగిపోయే అవకాశం ఉంది.
24 గంటల్లోనే డెలివరీ
నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ, డెలివరీ విషయంలో కంపెనీలు సానుకూల నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ బుక్ చేసిన 24 గంటల లోపే వినియోగదారుడి ఇంటికి సిలిండర్ చేరుకోవాలని ఏజెన్సీలను ఆదేశించాయి. దీనివల్ల నిత్యావసరమైన వంట గ్యాస్ కోసం కస్టమర్లు రోజులు తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
గ్యాస్ సిలిండర్ల నిల్వలకు ఎలాంటి కొరత లేదని అధికారులు చెబుతున్నారు. పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే ఈ నిబంధనలు తెచ్చాం. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పని లేదని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సిలిండర్లు సకాలంలో అందుతాయన్నారు. ఈ కొత్త నిబంధనల వల్ల గ్యాస్ వినియోగంలో పొదుపు పాటించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలపై ఈ 21 రోజుల నిబంధన కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read : VB G RAM G Act: కేంద్రం బంపరాఫర్.. లోగో డిజైన్ చేస్తే రూ.50 వేలు
Follow Us