Trump: 'ట్రంప్.. చిన్నారుల కళ్లలోకి చూడు'.. ఇరాన్‌ న్యూస్‌పేపర్‌ ఫస్ట్‌పేజీలో సంచలన వార్త

టెహ్రాన్ టైమ్స్‌ సంచలన కథనం వెలువరించింది. యుద్ధం మొదలైన రోజు ఇరాన్‌లోని మినాబ్‌లో ఓ స్కూల్‌పై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ చిన్నారుల ఫొటోలను సోమవారం ఈ న్యూస్‌పేపర్‌లో మొదటి పేజీలో ప్రచూరించింది.

New Update
Trump, Look Them In The Eyes, Tehran Times frontpage features

Trump, Look Them In The Eyes, Tehran Times frontpage features

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయకులు చనిపోతుండటంపై ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు చెందిన టెహ్రాన్ టైమ్స్‌ సంచలన కథనం వెలువరించింది. యుద్ధం మొదలైన రోజు ఇరాన్‌లోని మినాబ్‌లో ఓ స్కూల్‌పై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ చిన్నారుల ఫొటోలను సోమవారం ఈ న్యూస్‌పేపర్‌లో మొదటి పేజీలో ప్రచూరించింది. ''ట్రంప్ ఆ చిన్నారుల కళ్లలోకి చూడు అంటూ'' ఆ వార్తకు శీర్షికను పెట్టింది. 

Also Read: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. 16 ఏళ్ల హిందూ బాలుడి హత్య

అమెరికా చేసిన దాడిలో ఆ స్కూల్‌లో చదువుతున్న వందలాది మంది ఇరాన్‌ పిల్లలు చనిపోగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. ఇరాన్ ఆయుధాలకు కచ్చితత్వం ఉండదని.. మినాబ్‌లో పాఠశాలపై జరిగిన దాడి ఘటనలో ఆ దేశానిదే బాధ్యత అంటూ ఇటీవల ఓ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే టెహ్రాన్‌ టైమ్స్‌లో ఆ పిల్లల ఫొటోలను ప్రచురించారు.  ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: బహ్రెయిన్ చమురు శుద్ధి కర్మాగారం బాప్కోపై ఇరాన్‌ అటాక్‌..నిలిచిపోయిన ఇంధన శుద్ధి

జీవితాన్ని ఇంకా చూడని పసిపిల్లలు చిన్నతనంలో ప్రాణాలు కోల్పోవడం బాధకరమంటూ భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. స్కూల్‌పై జరిగిన దాడికి ట్రంప్, క్షిపణులు తయారుచేసిన వాళ్లు, దానికి టెక్నాలజీ సాయం అందించిన వాళ్లందరూ కూడా బాధ్యులేనని ఓ యూజర్‌ తీవ్రంగా విమర్శించారు.  ఈ దాడులకు వెంటనే ముగింపు పలకాల్సిన అవసరం ఉందని మరో యూజర్ కోరాడు. ఇదిలాఉండగా ఇరాన్‌ కొత్త సుప్రీ లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ (56) ఎన్నికైన సంగతి తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్‌కు తాము లొంగిపోయేది లేదని ఇరాన్ ఖరాఖండిగా చెబుతోంది. 

Advertisment
తాజా కథనాలు