/rtv/media/media_files/2026/02/28/ac-offers-2026-02-28-19-57-20.jpg)
AC OFFERS
సమ్మర్ రావడంతో ప్రస్తుతం చాలా మంది ఏసీ(Summer Sale AC Offers) ల వైపు మొగ్గు చూపుతున్నారు. తప్పకుండా ఇప్పుడు ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్‌లో మంచి ఆఫర్లు ఉన్నాయి. సుమారు రూ.50 వేలు ఉండే ఏసీని ఈ సమ్మర్ సేల్‌లో కేవలం రూ.20 వేలకే లభిస్తోంది. దాదాపుగా 50 శాతం భారీ తగ్గింపుతో ఈ సేల్‌లో లభిస్తుంది. అయితే ఇంతకీ ఏ కంపెనీ మోడల్? ఫీచర్లు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: Google Pixel 10a: గూగుల్ పిక్సెల్ కొత్త ఫోన్ సేల్ స్టార్ట్.. ధర, ఫీచర్లు మాములుగా లేవు భయ్యా..!
బెస్ట్ ఫీచర్లతో ఏసీ..
ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి లాయిడ్ (Lloyd) 0.8 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఏసీ అసలు ధర రూ. 47,990 ఉంది. అయితే సమ్మర్ సేల్‌లో భాగంగా అమెజాన్ సుమారు 50 శాతం భారీ తగ్గింపును అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి దీనిని కేవలం రూ. 22 వేలకే మీరు సొంతం చేసుకోవచ్చు. దీనికి ఉచిత డెలివరీ, ఇన్స్టాలేషన్ సౌకర్యం, ఒక ఏడాది ప్రొడక్ట్ వారంటీ, 10 రోజుల రీప్లేస్మెంట్ పాలసీ కూడా ఇస్తున్నారు.
ఇది కూడా చూడండి: Washing Machine Offers: పిచ్చెక్కిపోతారు మావా: రూ.19వేల వాషింగ్ మెషీన్ కేవలం రూ.7వేలకే..
ఈ ఏసీలో 6-ఇన్-1 కన్వర్టబుల్ ఫీచర్ ఉంది. దీని ద్వారా వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి కూలింగ్ స్థాయిని 30% నుంచి 110% వరకు మార్చుకోవచ్చు. సుమారు 90 చదరపు అడుగుల వరకు ఉండే గదులకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇందులోని ఇన్వర్టర్ కాంప్రెసర్ గది ఉష్ణోగ్రతను బట్టి తన వేగాన్ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకుంటుంది. దీనివల్ల గది త్వరగా చల్లబడుతుంది. అలాగే కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. ఈ ఏసీ గోల్డెన్ ఫిన్ కాపర్ కాయిల్స్ వాడటం వల్ల వేడిని వేగంగా బయటకు పంపుతుంది. దీంతో ఏసీ మన్నికగా ఎక్కువ కాలం వస్తుంది. అలాగే ఇందులో అత్యాధునిక ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యవస్థ కూడా ఉంది. ఇందులోని యాంటీ-వైరల్, PM 2.5 ఫిల్టర్లు గాలిలోని దుమ్ము, బ్యాక్టీరియా, వైరస్‌లను తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. అంతేకాకుండా దీనికి ప్రత్యేకంగా స్టెబిలైజర్ అవసరం లేదు. అలాగే 140V నుంచి 280V వరకు ఉండే వోల్టేజ్ హెచ్చుతగ్గులను ఇది సులభంగా తట్టుకోగలదు. హిడెన్ LED డిస్ప్లే, తక్కువ గ్యాస్ ఉన్నప్పుడు గుర్తించే సెన్సార్లు, టర్బో కూల్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. - summer-sale
ఇది కూడా చూడండి: New Smartphone: మార్కెట్లోకి కొత్త సరుకు.. రూ.6,866లకే లాంచ్: ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!
బయట ఉష్ణోగ్రత 52°C ఉన్నా కూడా గదిని చల్లగా ఉంచగల సామర్థ్యం ఈ ఏసీకి ఉంది. ఇందులోని 4-వే స్వింగ్ ఫీచర్ గాలిని గదిలోని అన్ని మూలలకు సమానంగా పంపిస్తుంది. ఇన్స్టాలేషన్ సమయంలోనే 15 రకాల డయాగ్నొస్టిక్ పరీక్షలు నిర్వహించి ఏసీ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేస్తారు. అయితే ఇది ఏడాదికి సుమారు 549.06 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుంది. పనిచేస్తున్నప్పుడు కేవలం 32 dB శబ్దంతో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. HDFC బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. పాత ఏసీని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 3,650 వరకు తగ్గించుకోవచ్చు. ఇలా మీరు రూ.22 వేలకే బెస్ట్ ఫీచర్లుతో ఉండే ఈ ఏసీని కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఒక్కసారి కొనుగోలు చేయలేని వారు ఈఎంఐని ఎంచుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Realme C83 5G: 7000mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కొత్త ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..!
Follow Us