/rtv/media/media_files/2026/03/08/india-2026-03-08-20-52-05.jpg)
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో టీమిండియా అదరగొట్టింది.5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు చేసింది. నీషమ్ వేసిన చివరి ఓవర్లో దూబే 24 (4,6,6,4,0,4 )పరుగులు బాదాడు. సంజు శాంసన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0), హార్దిక్ పాండ్య (18) పరుగులు చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇదే అత్యధిక టీ20 స్కోరు కావడం విశేషం.
సాధారణంగా వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే ఒత్తిడి ఎక్కువగా ఉండి జట్లు తక్కువ స్కోర్లకే పరిమితమవుతుంటాయి. కానీ అహ్మదాబాద్‌లో భారత్ ఆ పాత పద్ధతులను పూర్తిగా మార్చేసింది. 2024 ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాపై చేసిన 176 పరుగులే ఇప్పటివరకు అత్యధికం అనుకుంటే, సంజూ శాంసన్, అభిషేక్ శర్మల మెరుపు దాడితో ఆ రికార్డు ఇన్నింగ్స్ ముగియకముందే బద్దలైపోయింది. 2007లో పాకిస్థాన్‌పై చేసిన 157 పరుగుల నుండి మొదలుకొని, ఫైనల్స్‌లో మూడుసార్లు 150కి పైగా పరుగులు చేసిన ఏకైక జట్టుగా భారత్ చరిత్రలో నిలిచిపోయింది.
ఈ మ్యాచ్ ఆరంభం నుండే భారత ఆటగాళ్లు ఏమాత్రం తగ్గలేదు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఇన్నింగ్స్ మొత్తం ఒక యుద్ధంలా సాగింది. ముఖ్యంగా సంజూ "చేట్టా" శాంసన్ 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నడిపించగా, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ వేసిన పునాదిపై ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 54 పరుగులు జోడించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ వంతు, ఈ కొండంత లక్ష్యాన్ని వారు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
Follow Us