Andhra Pradesh: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. విజయవాడ-వైజాగ్ మధ్య బుల్లెట్ రైల్..

ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో బుల్లెట్‌ రైలు రానుంది. విజయవాడ-వైజాగ్‌ మధ్య దీన్ని నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడర్‌ను నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్‌ను సర్వే చేయాలని చూస్తోంది.

New Update
Bullet rail corridor between Vijayawada and Visakhapatnam

Bullet rail corridor between Vijayawada and Visakhapatnam

ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో బుల్లెట్‌ రైలు(bullet-train) రానుంది. విజయవాడ-వైజాగ్‌(vizag) మధ్య దీన్ని నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడర్‌ను నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇందుకోసం చివరి లొకేషన్‌ను సర్వే చేయాలని చూస్తోంది. విజయవాడ-కర్నూల్ మధ్య కూడా సెమీ హైస్పీడ్ రైలు కారిడర్ కూడా నిర్మించాలని భావిస్తోంది. అలాగే మరో ఆరు రూట్లలో కొత్త రైల్వే లైన్లు నిర్మించడంపై ఫోకస్ పెట్టింది. వీటికి ఫైనల్ లొకేషన్ సర్వే చేయడం కోసం పర్మిషన్ ఇవ్వాలని రైల్వే అధికారులు రైల్వే బోర్డు ప్రతిపాదనలు చేశారు. బోర్డు నుంచి అనుమతి వస్తే ఈ రైల్వే లైన్ నిర్మాణాలు జరగనున్నాయి.   

Also Read: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్‌..

Vijayawada To Visakhapatnam Bullet Rail

ఇదిలాఉండగా ఇటీవల జరిగిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. దేశంలోని వివిధ నగరాల్లో ఏడు హైస్పీడ్ రైలు కారిడర్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఇందులో ఏపీ రాజధాని అమరావతి మీదుగా  హైదరాబాద్‌-చెన్నై కారిడార్, కర్నూలు, అనంతపురం నుంచి హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్, ఇక చిత్తూరు మీదుగా చెన్నై-బెంగళూరు కారిడార్‌.. మొత్తంగా మూడు రానున్నాయి.  

Also Read: ఇండియాకు రష్యా బంపరాఫర్.. కష్ట సమయంలో నేనున్నాని పుతిన్ భరోసా

ఈ క్రమంలోనే విజయవాడ--వైజాగ్‌ మధ్య కూడా మరో హైస్పీడ్‌ రైల్ కారిడార్‌ను నిర్మిచాలని రైల్వేశాఖ భావిస్తోంది. మొత్తం 350 కిలోమీటర్లు ఉండే కారిడార్‌ ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయం రెండు నగరాల మధ్య చాలావరకు తగ్గనుంది. 

Advertisment
తాజా కథనాలు