/rtv/media/media_files/2026/03/08/india-3-2026-03-08-22-22-43.jpg)
అహ్మదాబాద్(ahmedabad) లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) లో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) కు మాత్రం ఈ ఫైనల్ ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో సూర్య ఒక అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలోనే 'గోల్డెన్ డక్' (తొలి బంతికే సున్నా పరుగులకు అవుట్) అయిన మొదటి కెప్టెన్‌గా సూర్య నిలిచాడు.
Also Read : న్యూజిలాండ్ చిత్తు.. వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా విక్టరీ!
Suryakumar Yadav's Unwanted Recorded
భారత ఇన్నింగ్స్ 17వ ఓవర్లో జిమ్మీ నీషమ్ వేసిన వరుస బంతుల్లో సంజూ శాంసన్ (89), ఇషాన్ కిషన్ (54) అవుట్ కాగా, ఆ ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో అత్యల్ప పరుగులు చేసిన కెప్టెన్‌గా గతంలో డారెన్ సామీ (2 పరుగులు) పేరిట ఉన్న రికార్డును సూర్య అధిగమించాడు. అయితే, కెప్టెన్ విఫలమైనా టాప్ ఆర్డర్ బ్యాటర్లు సృష్టించిన విధ్వంసం భారత్‌ను సురక్షిత స్థానంలో నిలిపింది.
అభిషేక్ శర్మ (52), సంజూ శాంసన్ (89) తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించగా, ఆ తర్వాత ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ స్కోరును 200 దాటించాడు. నీషమ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి కాస్త ఒత్తిడి పెంచినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్, భారత బౌలర్ల ధాటికి ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువలో ఉంది.
Also Read : సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర.. దెబ్బకు కోహ్లీ రికార్డు బద్దలు!
Follow Us