/rtv/media/media_files/2026/03/09/tech-mahindra-2026-03-09-14-30-16.jpg)
Tech Mahindra
ఏఐ రాకతో ఈమధ్య చాలా కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రాలో కూడా భారీగా లేఆఫ్‌లు జరగనున్నట్లు గత కొన్నిరోజులుగా ప్రచారం నడుస్తోంది. ఏకంగా 30 వేల మందిని తొలగించనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై తాజాగా ఆ సంస్థ స్పందించింది. ఇవన్ని తప్పుడు వార్తలని తేల్చిచెప్పింది. సోమవారం స్టాక్ ఎక్సేంచీ ఫైలింగ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
Also Read: బంగ్లాదేశ్‌లో స్కూళ్లు, కాలేజీలు బంద్.. డీజిల్, పెట్రోల్ కష్టాలు షురూ!
మా కంపెనీలో లేఆఫ్‌లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయని.. దీనిపై మాకు కూడా కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అందుకే ఈ వార్తలపై స్పందించాలని అనుకున్నామని చెప్పింది. ఉద్యోగుల లేఆఫ్‌కు సంబంధించి తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఇలాంటి అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామని పేర్కొంది.
Also Read: లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. నేడు పార్లమెంట్‌లో హై టెన్షన్
అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీతో కలిసి ఏజెంటిక్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నట్లు ఇటీవల టెక్ మహీంద్రా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆ సంస్థలో లేఆఫ్‌లు జరగనున్నట్లు ప్రచారం మొదలైంది. రానున్న రోజుల్లో ఇందులో 30 వేల ఉద్యోగులను తొలగిస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే టెక్ మహీంద్రా తాజాగా దీనిపై స్పష్టతనిచ్చింది. ఇదిలాఉండగా ప్రస్తుతం టెక్ మహీంద్రాలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత త్రైమాసికంలో ఎవరినీ జాబ్ నుంచి తొలగించలేదని ఆ కంపెనీ తెలిపింది.
Follow Us