/rtv/media/media_files/2026/03/09/iran-2026-03-09-17-23-17.jpg)
Iran Warns Its Citizens Abroad of Possible Death Penalty
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, అంతర్గత తిరుగుబాట్లతో ఇరాన్ ప్రభుత్వం సతమతమవుతోంది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాము లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే విదేశాల్లో నివసిస్తున్న ఇరాన్ పౌరులకు సంచలన వార్నింగ్ ఇచ్చింది. దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడం, శత్రు దేశాలకు సహకరించిన వాళ్లకు మరణశిక్ష విధిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం అధికారికంగా హెచ్చరించింది.
Also Read: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే 10 లక్షల కోట్లు నష్టం
తాజాగా జారీ చేసిన ప్రకటనలో ఇరాన్ ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. దీని ప్రకారం విదేశాల్లో ఉంటున్న ఇరానీయులు శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌తో చేతులు కలిపినా లేదా వాళ్ల సిద్ధాంతాలను ప్రచారం చేసిన వాళ్లని దేశద్రోహులుగా పరిగణిస్తారు. విదేశాల్లో ఉంటూ ఇరాన్ శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌లతో చేతులు కలపడం, గూఢచారి కార్యకలాపాలకు పాల్పడటం, ఇరాన్ భద్రతకు ముప్పు కల్పించే పరిస్థితులకు పాల్పడిన వాళ్లను దేశద్రోహులుగా ప్రకటిస్తారు. వీలైతే మరణశిక్ష కూడా అమలు చేస్తారు. అలాగే ఇరాన్‌లో ఉన్న వాళ్ల ఆస్తులను, బ్యాంక్ అకౌంట్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.
ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో.. దేశంలో అంతర్గత నిరసనలు పెరిగాయి. వీటికి విదేశాల్లో ఉంటున్న ఇరానియన్ పౌరులు సోషల్ మీడియాలో, ఇతర అంతర్జాతీయ వేదికల ద్వారా సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్లను అణిచివేసేందుకే ఇరాన్ ఈ బ్లాక్‌మెయిల్ వ్యూహాన్ని అనుసరిస్తోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.
Also Read: గ్యాస్ వినియోగదారులకు షాక్.. సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు!
అంతేకాదు ఇప్పటికే ఇరాన్ జైళ్లలో ఉన్న వందలాది నిరసనకారులకు సరైన విచారణ లేకుండానే మరణశిక్షలు అమలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి (UN), అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు కూడా ఇరాన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీంతో డ్యూయల్ సిటిజెన్‌షిప్ ఉన్న ఇరానీయులకు ఇది తలనొప్పిగా మారింది. సొంత దేశంలో ఉన్న కుటుంబ సభ్యులును, ఆస్తులను రక్షించుకునేందుకు ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడని పరిస్థితి ఉంది.
Follow Us