/rtv/media/media_files/2026/03/09/mojtaba-2026-03-09-06-37-36.jpg)
అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్న ఇరాన్ రాజకీయాల్లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్(new Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ(ayatollah-ali-khamenei) మరణానంతరం, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీం లీడర్(Iran Supreme Leader) గా నియమితులయ్యారు. గత ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చేసిన జాయింట్ ఆపరేషన్‌లో 86 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు సమాచారం. దేశంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు, ఇరాన్ మత పెద్దల మండలి (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్) అత్యవసరంగా సమావేశమై మొజ్తబా ఖమేనీని అత్యున్నత నాయకుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
BREAKING: Mojtaba Khamenei, the second son of Ayatollah Ali Khamenei, has been named as Iran's new leader.
— Brian Krassenstein (@krassenstein) March 8, 2026
Note that this is the exact opposite of what Trump wanted. He is more extreme than his father and now has the added incentive of revenging his father’s death.
This war… pic.twitter.com/UcnmwzyP2J
Also Read : రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ట్రంప్ సంచలన ప్రకటన
ఎవరీ మొజ్తబా ఖమేనీ?
1969లో మషద్‌లో జన్మించిన మొజ్తబా ఖమేనీ, అయతొల్లా అలీ ఖమేనీకి రెండో కుమారుడు. ఆయనకు ఇప్పటివరకు ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక పదవులూ లేవు. అయినప్పటికీ, గత రెండు దశాబ్దాలుగా తన తండ్రి కార్యాలయాన్ని (బీట్ రహ్బరి) తెరవెనుక ఉండి నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
సైనిక సంబంధాలు:
మొజ్తబాకు ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1980లలో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఆయనకు ఉంది.
మతపరమైన హోదా: ఆయన క్లెరికల్ విద్యను అభ్యసించి 'హుజ్జత్ అల్-ఇస్లాం' (మధ్యస్థ స్థాయి మతగురువు) హోదాను పొందారు. అయితే సుప్రీం లీడర్‌కు ఉండాల్సిన 'అయతొల్లా' హోదా ఆయనకు లేకపోవడం ప్రస్తుతం చర్చినీయాంశమైంది.
Also Read : పశ్చిమాసియాలో యుద్ధం.. స్వదేశానికి చేరుకున్న 52 వేల మంది భారతీయులు
వారసత్వ రాజకీయాలపై విమర్శలు
1979 ఇస్లామిక్ విప్లవం ద్వారా ఇరాన్‌లో రాచరికాన్ని అంతం చేశారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి తర్వాత కుమారుడికి అధికారం అప్పగించడం ద్వారా అక్కడ 'వారసత్వ పాలన' మొదలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. "మా ఆమోదం లేకుండా ఏ కొత్త నాయకుడూ ఎక్కువ కాలం నిలబడలేడు" అని ట్రంప్ హెచ్చరించారు. మొజ్తబా నియామకంతో ఇరాన్ తన పాత కఠినమైన విధానాలనే కొనసాగించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం తీవ్రమవుతున్న వేళ, మొజ్తబా నాయకత్వం ఇరాన్‌ను ఏ దిశగా నడిపిస్తుందో అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.
Follow Us