/rtv/media/media_files/2026/03/09/gyanesh-kumar-2026-03-09-19-59-41.jpg)
Gyanesh Kumar
Gyanesh Kumar : గతంలో ఎన్నడు లేని విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు దేశవ్యాప్తంగా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. అంతేకాదు, మనదేశ చరిత్రలోనే తొలిసారిగా జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు విపక్ష పార్టీలు రెడీ అవుతుండటం విశేషం.
Despite Supreme Court ruling, that in SIR nothing is wrong…..only in West Bengal politically motivated protest goes on.
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 9, 2026
Protests erupt outside Kalighat temple as CEC Gyanesh Kumar visits Adya Kali Shaktipeeth in Kolkata. pic.twitter.com/3xU7pRP37M
కోల్ కతాలో నల్లజెండాలతో నిరసన
కాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ రోజు కోల్‌కతాలోని ప్రఖ్యాత కాళిఘాట్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ను చేపట్టింది. ఈ క్రమంలో ఆయన ఇటీవలనే పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసి తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. అందులో దాదాపు 50 లక్షలమందికి పైగా నకిలీ ఓటర్లు ఉన్నారని వారిని తొలగించారు. కాగా ఇది అక్కడ వివాదాలకు కారణమైంది. కాగా, ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఆయన తొలిసారి కోల్‌కతా వచ్చారు. దీంతో ఆయనకు అడుగడుగున నిరసన వ్యక్తమైంది.
కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మూడు రోజుల పాటు కొల్‌కతాలో పర్యటిస్తారు. స్థానికగా ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లను సమీక్షిస్తారు. రాజకీయ పార్టీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో వరుస సమావేశాలను నిర్వహిస్తారు. అయితే ఆయనకు ఈ మూడు రోజులు నిరసనలు తప్పేలా లేవు.
ఆయన విమానశ్రయంలో దిగింది మొదలు ఇదే తరహా నిరసనలు ఎదురయ్యాయి. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు'గో బ్యాక్' నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్ వెళ్తున్న దారి వెంట పలుచోట్ల టీఎంసీ కార్యకర్తలు. వామపక్షాలు నల్లజెండాలతో నిరసనలు వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీలు ఎయిర్‌పోర్ట్ బయట నిరసనలకు దిగడంతో ఒక సమయంలోఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అయితే పరిస్థితులు చేజారిపోకుండా పోలీసులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇతర కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కూడా కోల్ కతా చేరుకున్నారు. వారు కూడా ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనున్నారు. శాంతి భద్రతల పరిస్థితి, చేయాల్సిన ఏర్పాట్లు వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం తదితర అంశాలను ప్రధానంగా సీఈసీ బృందం సమీక్షించనుంది. బూత్ స్థాయి అధికారులతోనూ సీఈసీ సమావేశం కానుననారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం
మరోవైపు దేశ చరిత్రలోనే తొలిసారి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనుండటం సంచలనంగా మారింది. ఆయన తీసుకువచ్చిన ఎన్నికల సంస్కరణలు దేశవ్యా్ప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అనేక రాష్ర్టాల్లో నకిలీ ఓటర్ల పేరుతో పలువురి ఓట్లను తొలగించడం వివాదస్పదమైంది.దీంతో అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు విపక్ష పార్టీలు రెడీ అవుతున్నాయి. దానకి సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే రెడీ చేశారని ఈ వారంలో లోక్‌సభ లేదా రాజ్యసభలో సమర్పించే అవకాశం ఉంది.
కాగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలనే డిమాండ్‌తో కూడిన అభిశంసన తీర్మానం విషయంలో విపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయని, భావసారూప్య పార్టీలన్నీ కలిసి సీఈసీ పై అభిశంసన నోటీసు, ఇతర ప్రణాళికలన్నీ సిద్ధం చేశాయని విపక్షాలు చెబుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ నోటీసును ప్రవేశ పెట్టే విషయంలోనూ అన్ని పక్షాల కలిసి కట్టుగా పనిచేస్తాయని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఈసీ అనే గొప్ప పదవి విలువను తగ్గించేలా జ్ఞానేశ్ కుమార్ వ్యవహరిస్తున్నారని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఆయనపై అభిశంసన నోటీసు జారీ చేయనున్నామని తెలిపారు.
Follow Us