Trump : త్వరలోనే ఘర్షణలను ముగించేస్తాం..ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌తో యుద్ధం మూలంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో మాట్లాడిన ట్రంప్ మేం ఈ ఘర్షణను ముగించడానికి చాలా దగ్గరగా ఉన్నాం అన్నారు. అయితే కచ్చితమైన సమయం మాత్రం వెల్లడించలేదు.

New Update
Donald Trump

Donald Trump

Trump :  ఇరాన్‌తో యుద్ధం మూలంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తుండగా ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా సైనిక స్థావరాలున్న గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు కొనసాగిస్తోంది. కాగా పశ్చిమాసియా యుద్ధం మూలంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ యుద్ధం  ప్రపంచ చమురు మార్కెట్లో తీవ్ర సంక్షోభం సృష్టించింది. గల్ఫ్‌ దేశాల నుంచి చమురు దిగుబడులు నిలిచిపోవడంతో ప్రపంచ దేశాలన్నీ పెరిగిన ధరలతో  ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు చమురును పొదుపుగా వాడుకోవాలని ఆంక్షలు విధిస్తున్నాయి. మరికొన్ని దేశాల్లో ఇంధన ధరలను పెంచేస్తున్నాయి.  ఈ తరుణంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్‌తో ఘర్షణలు త్వరలోనే ముగుస్తాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా ఇరాన్‌ తో ఘర్షణను చిన్నపాటి సైనిక చర్యగా అభివర్ణించిన ట్రంప్‌ ఇటీవల అమెరికా -ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన ఆయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా సోమవారం ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ (56) ఎన్నిక కావడం తనను నిరాశ పరిచిందన్నారు. ఆయన వల్ల కూడా ఇరాన్‌లో సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు.

ఇక త్వరలోనే యుద్ధం ముగిసే అవకాశముందని ట్రంప్ చెప్పినప్పటికీ కచ్చితమైన సమయం మాత్రం వెల్లడించలేదు. ఫ్లోరిడాలో మాట్లాడిన ట్రంప్ మేం ఈ ఘర్షణను ముగించడానికి చాలా దగ్గరగా ఉన్నాం అన్నారు. ప్రపంచాన్ని బందీగా చేసి చమురు సరఫరాలను నిలిపివేయడానికి ఏ దేశాన్నీ అనుమతించబోమని ట్రంప్‌ హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్‌ ఆ ప్రయత్నం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, అలా చేస్తే  ఆ దేశం ఈ ఘర్షణల నుంచి కోలుకోవడం చాలా కష్టం అవుతుందని ట్రంప్ సున్నితంగా హెచ్చరించడం గమనార్హం.
 
కాగా, త్వరలోనే యుద్ధం ముగిస్తామని ట్రంప్‌ చేప్పడంతో ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయ చమురు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి, పలు దేశాల్లో చమురు ధరలు కొంత తగ్గాయి. ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా అమెరికా చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన పేర్కొనడం ఆయా దేశాలకు కొంత ఊరటనిచ్చింది. ఒకవేళ చమురు సరఫరాను అడ్డుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరించారు.  

త్వరలోనే ముగిస్తాం

అయితే త్వరలోనే యుద్ధం ముగించేస్తామని ట్రంప్‌ పేర్కొనడం చమురు దరలపై కొంత ప్రభావం చూపినప్పటికీ అయితే త్వరలో అంటే ఒక వారంలోనా? అనే ప్రశ్నకు ట్రంప్ సరైన సమాధానం చెప్పలేదు. వారంలో అని కాదు, కానీ 
 కానీ త్వరలోనే అని మాత్రమే సమాధానం చెప్పారు. కాగా ఇప్పటికే ఇరాన్ సైన్యం తీవ్రంగా బలహీనపడిందన్నారు. మధ్యప్రాచ్యంపై ఆధిపత్యం సాధించి ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని ఇరాన్‌ కుట్ర పన్నిందని ట్రంప్ ఆరోపించారు. మేం ఆ కుట్రను సమయానికి అడ్డుకున్నామన్నారు.  ప్రపంచ చమురు సరఫరాలకు అంతరాయం కలగకుండా అమెరికా చర్యలు తీసుకుంటోందని ట్రంప్ స్పష్టం చేశారు. గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న ట్యాంకర్లకు రాజకీయ ప్రమాద బీమా అందజేస్తామన్నారు. అలాగే ధరలను తగ్గించేందుకు కొన్ని చమురు సంబంధిత ఆంక్షలను సడలించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే అమెరికా నావికాదళం, మిత్రదేశాలు ట్యాంకర్లను జలసంధి గుండా సురక్షితంగా తీసుకెళ్తాయని ట్రంప్‌ తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండేందుకు ఇరాన్ నాయకత్వంపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తంగా  ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు  ప్రపంచ చమురు మార్కెట్లను, అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు