BREAKING: టీవీకే విజయ్‌కు బిగ్ షాక్.. సీబీఐ సమన్లు

టీవీకే చీఫ్‌ విజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 10న (మంగళవారం) విచారణకు రావాలని తెలిపింది.

New Update
CBI summons Vijay again for questioning in Karur stampede probe on Tuesday

CBI summons Vijay again for questioning in Karur stampede probe on Tuesday

టీవీకే చీఫ్‌ విజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 10న (మంగళవారం) విచారణకు రావాలని తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో నిర్వహించిన సభలో తొక్కిసలాట ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 

Also Read: లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. నేడు పార్లమెంట్‌లో హై టెన్షన్

ఈ క్రమంలోనే తాజాగా విజయ్‌ను మరోసారి విచారణకు హాజరుకావాలంటూ సమన్లు పంపించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరగుతుండటంతో విజయ్ ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే సీబీఐ అధికారులు ఆయన నుంచి ఆధారాలు సేకరించారు. అయితే దీనిపై మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉండటంతో విజయ్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు.  

Also Read: గ్యాస్ వినియోగదారులకు షాక్.. సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు!

కరూర్‌ సభ ర్యాలీ సమయంలో నిర్వహణ ఏర్పాట్లు, ఈవెంట్ వేదికకు సంబంధించి మంజూరు చేసిన పర్మిషన్లు, టీవీకే పార్టీ, అలాగే తమిళనాడు సర్కార్‌ వాదనలపై అధికారులు దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు కీలక హామీలు ప్రకటిస్తున్నాయి. టీవీకే పార్టీ కూడా ఇటీవల తమ మెనిఫెస్టోను విడుదల చేసింది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో విజయ్‌కు సీబీఐ నుంచి చిక్కులు ఎదురవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Advertisment
తాజా కథనాలు