Kavitha : ఖమ్మం జెడ్పీసెంటర్‌లో ఉద్రిక్తత.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్

వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం జెడ్పీ సెంటర్ లో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కవితతో పాటు ,విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
FotoJet (12)

Telangana Jagruti president Kalvakuntla Kavitha arrested

Kavitha : వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం జెడ్పీ సెంటర్ లో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా, మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే కవితతో పాటు పలువురు మహిళల అరెస్టు చేయడం వివాదస్పదమైంది. దీంతో పోలీసుల తీరుపై జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాగా అంతకు ముందు కవిత  వెలుగుమట్ల బాధితులను ఉద్ధేశించి ఆమె మాట్లాడుతూ..వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని, ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఈ ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల పరీక్షల సమయంలో పుస్తకాలతో సహా ఇళ్లను కూల్చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఆవేదన, బాధ కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ గా మారిందన్నారు. గతంలో మీ ఇళ్లు కూల్చే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు.

ముఖ్యమంత్రి, జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఈ సమస్యపై మాట్లాడాలి. బాధితుల ఇళ్లు కూల్చిన చోటే వారికి కొత్త ఇళ్లు కట్టివ్వాలని కవిత డిమాండ్‌ చేశారు.రాష్ట్రంలో పేదలపై జులుం నడుస్తోంది. పెద్ద వాళ్ల బిల్డింగ్ ల జోలికి వెళ్లటం లేదు బాధితుల సమస్య పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వానికి, నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుంది. ఒక ఆడబిడ్డ ఏడిస్తేనే ఇంటికి మంచిది కాదు. అలాంటిది ఇంత మంది ఆడబిడ్డల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. పిల్లల ఎగ్జామ్స్ సమయంలో తల్లితండ్రులు ఎంతో ఆందోళనతో ఉంటారు ఎగ్జామ్స్ సయమంలో పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేశారు. మీ ఇళ్లు కూల్చేస్తే చాలా మంది రాజకీయ నాయకులు ఎగ్జిబిషన్ చూసినట్లు చూసి వెళ్లారని ఎద్దేవా చేశారు.

నన్ను కూడా తొందరగా ఇక్కడకు వెళ్లు అని చాలా మంది చెప్పారు. నేను ఎక్కడున్నా సరే మహిళలు, పేదల పక్షానే ఉంటా అని కవిత అన్నారు. ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం వచ్చే వరకు  వదలి వెళ్లనన్నారు. నేను ఏదో మిమ్మల్ని చూసి వెళ్లటానికి ఇక్కడకు రాలేదు. మీ సమస్యలు సావధనంగా విని...వాటిని ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించేందుకు వచ్చాను. మీతో పాటు ఇక్కడ విశారదన్ మహారాజ్ గారు కూడా ఉన్నారు. ఆయన పట్టుపడితే వదలరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలతో పాటు జాగృతి కూడా మీకు తోడుగా ఉందని కవిత హామీ ఇచ్చారు.

ఒక సమస్యకు పరిష్కారం వచ్చే వరకు కూడా మనం సమస్యను వదలకుండా పోరాటం చేద్దాం. మనల్ని ఓ కొట్టంలోకి తోలినట్లు ఇక్కడకు తీసుకొచ్చి పెట్టేశారు. కనీసం మహిళలకు ప్రత్యేక వసతి లేదు. హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు కనీసం హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదని ఆరోపించారు.గతంలో మన ఇళ్లు కూల్చేసే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్లు భోజనాలు, హెల్త్ క్యాంప్ లు పెట్టారంట. మంచిదే వాళ్లు చేసిన పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకపోవటం దారుణం అన్నారు.

కలెక్టర్ ఒక్క రోజు కూడా రాలేదని చెబుతున్నారు. ముగ్గురు మంత్రులు ఈ జిల్లాకు ఉంటే ఒక్కరికి కూడా సోయిలేదు. ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు ఈ సమస్యపై మాట్లాడాలి. ముందుగా జిల్లా కలెక్టర్ ఇక్కడకు రావాలన్నది మన డిమాండ్. అదే విధంగా మన ఇళ్లు ఎక్కడ నేలమట్టం చేశారో...అక్కడే కొత్తగా ఇళ్లు కట్టించి ఇవ్వాలి. వేరే చోటకు వెళ్లమంటే వెళ్లేది లేదు. ఇక్కడే ఇళ్లు కట్టించేలా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.రాహుల్ గాంధీ పట్టుకునే రాజ్యాంగాన్ని కూనీ చేసేలా పేదల మీదకు బుల్జోజర్లు వస్తున్నాయి దానిని ఎదిరించి మీ పక్షాన నిలిచేందుకే ఇక్కడకు వచ్చాం. మనందరం కలిసి ఓ కార్యాచరణ రూపొందించుకొని పరిష్కారం కోసం ప్రయత్నిద్దాం అని కవిత సూచించారు.

Advertisment
తాజా కథనాలు