Telangana movement : కేసీఆర్, కేటీఆర్ కు గుడ్ న్యూస్.. ఆ కేసు కొట్టివేత!

తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకలజనుల సమ్మె సమయంలో నమోదైన కేసులను నాంపల్లి కోర్ట కొట్టివేసింది. అందులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్,బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పైన నమోదైన ఓ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

New Update
FotoJet (15)

ktr kcr

Telangana movement : తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకలజనుల సమ్మె సమయంలో నమోదైన కేసులను నాంపల్లి కోర్ట కొట్టివేసింది. అందులో బీఆర్‌ఎస్‌ అధినేత.మాజీ ముఖ్యమంత్రికేసీఆర్,బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పైన నమోదైన ఓ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.  

ఈ సందర్భంగా ఈ కేసును వాదిస్తున్న బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు జక్కుల  లక్ష్మణ్ మాట్లాడుతూ 2009 నుండి తెలంగాణ ఉద్యమ కేసులు వాదిస్తున్నానని కేసీఆర్ రైలు రోకో కేసుతో పాటు సకల జనుల సమ్మె కేసును చూస్తున్నానని,ఉద్యమ న్యాయవాదిగా కేసీఆర్ సకల జనుల సమ్మె కేసు గురించి కొట్లాడడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

2011 సమయంలో బంజారాహిల్స్ పోలీసులు సకల జనుల సమ్మె పిలుపులో భాగంగా  కేసీఆర్, కేటీఆర్, పద్మారావు,శంభీపూర్ రాజు, దాసోజీ శ్రవణ్, కోదండా రామ్ మరికొందరిపైన నమోదైన కేసును నాంపల్లి కోర్టులో వాదించినట్లు తెలిపారు. కాగా కేసు పుర్వాపరాలు పరిశీలించిన నాంపల్లి కోర్టు కేసును క్లోజ్ చేయడం జరిగిందని వివరించారు.

Advertisment
తాజా కథనాలు