/rtv/media/media_files/2026/03/09/fake-job-websites-2026-03-09-19-09-01.jpg)
Cenral govt alerts Beware of Fake Job Websites!
ఈమధ్యకాలంలో చాలామంది సైబర్ కేటుగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్లు, లింకులపై క్లిక్ చేసి మోసపోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఫేక్ వెబ్‌సైట్‌ల విషయంలో తాజాగా కీలక హెచ్చరికలు చేసింది. సైబర్ నేరగాళ్లు చేసే ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సమగ్ర శిక్షా అభియాన్ అధికారిక వెబ్‌సైట్ లాగే సైబర్ నేరగాళ్లు http://sarvashikshaabhiyan.com అనే వెబ్‌సైట్ తయారుచేశారని పేర్కొంది.
Also Read: యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశం
ఈ వెబ్‌సైట్ నుంచి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి జనాల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. పీబీఐ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో దీనికి సంబంధించి ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ ఫేక్ వెబ్‌సైట్‌తో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. సమగ్రశిక్షా అభియాన్ అధికారిక వెబ్‌సైట్ https://samagra.education.gov.in/ లింక్‌ను షేర్ చేసింది.
🚨 Beware of Fake Job Websites! ⚠️
— PIB Fact Check (@PIBFactCheck) March 9, 2026
A fraudulent website, 'https://t.co/7SBNovCTVq', is impersonating the official website of Samagra Shiksha Abhiyan and demanding payment from applicants on the pretext of providing job opportunities.#PIBFactCheck
❌ This website has NO… pic.twitter.com/POsjP0z4qj
Also Read: యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశం
ఉద్యోగ నోటిఫికేషన్‌లు, నియామకాలకు సంబంధించి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లోనే చెక్ చేసుకోవాలని సూచించింది. అందుకే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే ముందు, అలాగే వ్యక్తిగత సమాచారన్ని ఇచ్చే ముందు ఆ సైట్లను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని చెప్పింది. సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని.. ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండాలని తెలిపింది.
Follow Us