/rtv/media/media_files/2026/03/09/gold-2026-03-09-15-34-41.jpg)
Iran War Creates $35 Trillion 'Superpower', Bigger Than India and UK Combined
ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మిడిల్ఈస్ట్‌లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బంగారం విలువ ఏకంగా 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది భారత్, యూకే దేశాల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే 10 లక్షల కోట్లు నష్టం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అవున్స్‌కు 5400 నుంచి 5600 డాలర్ల మధ్య పలుకుతున్నాయి. యుద్ధం మాత్రమే కాక.. వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేయడం, కరోనా తర్వాత ద్రవ్యోల్బణం రావడం లాంటివి కూడా ఈ ధరలు పెరగడానికి కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు.
Also read: భగ్గుమంటున్న చమురు ధరలు.. 100 డాలర్లు దాటిన బ్యారెల్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. భారత్, బ్రిటన్‌ల జీడీపీ 8 -9 ట్రిలియన్ డాలర్లు ఉండగా.. ప్రపంచ గోల్డ్ మార్కెట్ విలువ 30-35 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గత 13 ఏళ్లుగా బంగారం ధరలు ఒకే స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం 1972, 2005 నాటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఒకవేళ మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గి శాంతి నెలకొంటే బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Follow Us