China: ఆకాశాన్ని తాకుతున్న చమురు ధరలు, మౌనం పాటిస్తున్న చైనా.. కారణాలు ఇవే !

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో చమరు ధరల పెరుగుదల ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలపై ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారైన చైనా మాత్రం స్పందించడం లేదు. డ్రాగన్ మౌనం వెనుక ఉన్న కారణాలంటే ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
As Oil Prices Soar, China’s Strategic Silence Amid Global Turmoil

As Oil Prices Soar, China’s Strategic Silence Amid Global Turmoil

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో చమరు ధరల పెరుగుదల ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. గత వారమే బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరుకుటుందని అందరూ భావించారు. కానీ అది ఏకంగా 110 డాలర్ల మార్క్‌ను చేరుకుంది. గత నెలలోనే ఈ ధర 56 శాతం పెరిగింది. అయితే ఈ పరిణామాలపై ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారైన చైనా మాత్రం స్పందించడం లేదు. డ్రాగన్ మౌనం వెనుక ఉన్న కారణాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. 

చైనాకు పెరిగిన చమురు నిల్వలు 

చమురు ధరలు తక్కువ ఉన్న సమయంలోనే చైనా వ్యూహాత్మకంగా భారీ వాటి నిల్వలను పెంచుకుంది. చైనా వద్ద ప్రస్తుతం 9--00 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిల్వలు చైనా దిగుమతి అవసరాలను దాదాపు 90 నుంచి 120 రోజుల వరకు తీర్చగలదు. భారత్‌ దగ్గర మాత్రం 45 నుంచి 50 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. చైనా వద్ద నెలలకు సరిపడా నిల్వలు ఉండటంతోనే చమురు ధరల పెరుగుదలపై చైనా స్పందించడం లేదు.  

Also Read: పశ్చిమాసియాలో యుద్ధం.. 30-35 ట్రిలియన్ డాలర్లకు చేరిన బంగారం విలువ

రష్యా, ఇరాన్ నుంచి చౌకగా దిగుమతులు 

చైనా అమెరికా ఆంక్షలు లెక్కచేయకుండా తమ మిత్ర దేశాలైన రష్యా, ఇరాన్‌ నుంచి భారీ డిస్కౌంట్‌లతో చమురును కొనుగోలు చేస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌ ధరలతో సంబంధం లేకుండానే ఈ రెండు దేశాల నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తోంది. అందుకే చైనా ఆర్థిక వ్యవస్థపై ఈ భారం తక్కువగా ఉంది. 

దీర్ఘకాలిక ఒప్పందాలు

సౌదీ అరేబియా, యూఏఈ లాంటి మిడిల్‌ఈస్ట్‌ దేశాలతో చైనాకు దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలు ఉన్నాయి. వీటి ప్రకారం చూసుకుంటే ధరల అస్థిరత తక్కువగానే ఉంది. చమురు ధరలు మార్కెట్‌లో బాగా పెరిగిన సమయంలో దిగుమతులు తగ్గించి, నిల్వ ఉన్న చమురును చైనాకు వాడుకునే వెసులుబాటు ఉంది. మరోవైపు చైనా కేవలం చమురుపై మాత్రమే ఆధారపడకుండా బొగ్గు, గ్యాస్, అణుశక్తి, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇది చమురు ధరల పెరుగుదల వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని చాలావరకు తగ్గిస్తుంది. 

Also Read: బంగ్లాదేశ్‌లో స్కూళ్లు, కాలేజీలు బంద్.. డీజిల్, పెట్రోల్ కష్టాలు షురూ!

ఈ నెల చివర్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. ఈ సమయంలో చైనా దాదాపు 500 విమానాల కొనుగోలుకు సంబంధించి ఓ భారీ ఒప్పందం చేసుకునే ఛాన్స్ ఉంది. అందుకే ఈ పర్యటనకు ముందు చమురు ధరల పెరుగుదలపై మౌనంగా ఉంది. ముందుగా దౌత్య చర్చలకే ప్రాధాన్యం ఇస్తోంది.  ఇదిలాఉండగా.. చైనా 2025లో  సగటున రోజుకు 11.5 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. గత కొన్ని నెలలుగా ఇది 12-13 మిలియన్ బ్యారెళ్లకు చేరిపోయింది. ఇంత పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటన్న చైనా ధరల పెరుగుదలపై మౌనం పాటిస్తుందంటే ఇప్పటికే అది ఆర్థిక రక్షణ కవచాన్ని సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.   

Advertisment
తాజా కథనాలు