🔴Operation Sindoor Live Updates: ఆపరేషన్ సిందూర్ - లైవ్

పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్‌ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది భారత్‌. తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దాడి ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

author-image
By Lok Prakash
New Update
updates op

Operation Sindoor Live Updates

🔴Operation Sindoor Live Updates: 

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్(India), పాకిస్తాన్(Pakistan) ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అవిపీక్స్ కు చేరుకున్నాయి. ఇన్నాళ్ళు పాకిస్తాన్ పై నదీజలాలు, దౌత్యపరంగా దాడులు చేస్తున్న ఇండియా నిన్న అర్థరాత్రి నుంచి ప్రత్యక్ష దాడులను చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్థరాత్రి 1.44 గంటలకు పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేపట్టింది భారత సైన్యం. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. సీమాంతర దాడులకు కారణమని భావిస్తున్న మొత్తం తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపింది. దీనికి భారత ఆర్మీ(Indian Army) ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. భారత ప్రధాని మోదీ(PM Modi) ఈ మొత్తం ఆపరేషన్ ను దగ్గరుండి ప్రతీ నిమిషం మోనిటర్ చేస్తున్నారు. 

Also Read: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

Also Read: భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

తొమ్మిది ఉగ్రస్థావరాలపై..

తాము ఎక్కడ దాడి చేస్తున్నమో తెలిసే..పూర్తి కచ్చితత్వంతో దాడులు చేస్తున్నామని భారత ఆర్మీ తెలిపింది. పాకిస్తాన్ సైనిక బలగాల మీద, సదుపాయాల మీదా అటాక్ చేయలేదని స్పష్టం చేసింది. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌(Indian Air Force) బలగాలు సంయుక్తంగా ఈ డిని నిర్వహించాయి. మిస్సైళ్ళతో విరుచుకుపడింది. గత మూడు నాలుగు రోజులుగా దాడులు చేస్తామని చెబుతున్న భారత ప్రభుత్వం మొత్తానికి రంగంలోకి దిగింది. మరోవైపు ఈరోజు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్(Mock Drill) నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం చేపట్టిన దాడుల గురించి పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని రక్షణశాఖ ప్రకటించింది. 

Also Read: పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

ఇక న్యాయం జరిగింది అంటూ భారత ఆర్మీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దాంతో పాటూ దాడులకు సంబంధించిన వీడియోలు కూడా పెట్టింది. అయితే దాడులు ఎక్కడ చేశారో మాత్రం చెప్పలేదు. టెర్రరిస్టు గ్రూప్‌ లష్కరే తొయిబాకు మురిడ్కే హెడ్‌ క్వార్టర్స్‌గా ఉంది. ఇక పంజాబ్‌ ప్రావిన్స్‌లోని బహవల్పూర్‌లో మసూద్‌ అజార్‌ నేతృత్వంలోని జైష్‌ -ఎ- మహ్మద్‌ స్థావరం ఉంది. వీటిపైనే ఇండియన్ ఆర్మీ అటాక్(Indian Army Attack) చేసి ఉంటుందని అంటున్నారు. 

  • May 07, 2025 21:54 IST

    Operation sindoor: ఆపరేషన్ సిందూర్ 2.0కు ఇండియా ప్లాన్.. ఎప్పుడంటే ?

    భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట విజయవంతంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆపరేషన్ సిందూర్ 2.0కు కూడా ఇండియా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి లేదా మళ్లీ ఎప్పుడైనా పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు జరపనున్నట్లు తెలుస్తోంది.

    Operation Sindoor
    Operation Sindoor

     



  • May 07, 2025 20:34 IST

    Pakistan Terror Camps: ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన.. ఉగ్రవాద స్థావరాల లిస్ట్ రిలీజ్

    భారతీయ ఆర్మీ అధికారులు సంచలన ప్రకటన చేశారు. పాక్, పీఓకేలలో ఉత్తరంలోని సవాయ్ నాలా నుంచి దక్షిణాన బహవల్‌పూర్ వరకు 21 ప్రసిద్ధ శిక్షణా శిబిరాలు ఉన్నాయని వెల్లడించారు. అందులో భారత్ 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది.

    Pakistan Terror Camps



  • May 07, 2025 20:33 IST

    India Pak War: రాజధాని ఢిల్లీలో చిమ్మ చీకటి.. హై అలర్ట్‌లో బ్లాక్ అవుట్

    ఎమర్జెన్సీ టైంలో ఎలా స్పందించాలో దేశవ్యాప్తంగా నిర్వహించే మాక్ డ్రిల్‌లో భాగంగా న్యూఢిల్లీలో ఈరోజు రాత్రి 8:00 గంటల నుంచి15 నిమిషాల పాటు బ్లాక్‌అవుట్ ప్రకటించారు. హోం మినిస్ట్రీ డైరెక్షన్‌లో ఈ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహిస్తున్నారు.

    Blackout



  • May 07, 2025 19:32 IST

    Pakistan: పాకిస్థాన్ ముర్దాబాద్.. అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు (VIDEO VIRAL)

    MIM అధినేత గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్‌పై ఫైర్ అయ్యారు. బిహార్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. అది ఫైయిలైన దేశమని, పాక్‌ను ఇక శిక్షించడమే మిగిలి ఉందని విమర్శలు గుప్పించారు.

    Asaduddin Owaisi



  • May 07, 2025 19:14 IST

    Operation Sindoor: నా బాధ ఇప్పుడు తెలిసిందా.. ఆపరేషన్ సిందూర్‎పై హిమాన్షి రియాక్షన్!

    ఆపరేషన్ సిందూర్‎పై ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్పందించారు. 'నా భర్తను విడిచిపెట్టమని వేడుకున్నా వదల్లేదు. ఇప్పుడు నా బాధ ఎలా ఉంటుందో వారికి తెలిసింది' అంటూ ఎమోషనల్ అయ్యారు.

    himansi
    himansi Photograph: (himansi)

     



  • May 07, 2025 19:10 IST

    BREAKING: పాక్‌ కాల్పుల్లో 15 మంది భారత పౌరులు మృతి

    భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అయితే ఆ తర్వాత పాకిస్థాన్‌ రేంజర్లు కూడా బుధవారం కాల్పులకు పాల్పడ్డారు.ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందారని,మరో 43 మంది గాయపడ్డారని ఇండియ్ ఆర్మీ తెలిపింది.

    15 civilians killed, 43 injured in Pakistan Attack
    15 civilians killed, 43 injured in Pakistan Attack

     



  • May 07, 2025 19:09 IST

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మళ్లీ పారిపోయిన పాక్ ఆర్మీ చీఫ్!

    భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మౌనంగా ఉన్నాడు. ఈ దాడుల తర్వాత ఆయన ఎక్కడా కూడా కనిపించలేదు. ఇటీవల అతడు దేశం విడిచి పారిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి.

    Pakistan Army Chief Asim Munir
    Pakistan Army Chief Asim Munir

     



  • May 07, 2025 18:27 IST

    Operation Sindoor: విదేశాల భద్రతా సలహాదారులతో ఇండియన్ జేమ్స్‌బాండ్ అజిత్ దోవల్ కీలక సమావేశం

    ఆపరేషన్ సిందూర్‌ గురించి విదేశాల భద్రతా సలహాదారులతో ఇండియన్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సమావేశామైయ్యారు. ఎయిర్ స్ట్రైక్‌కు గురించి వారికి వివరించారు. అమెరికా, UK, సౌదీ అరేబియా, జపాన్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో బుధవారం అజిత్‌ దోవల్‌ సమావేశమయ్యారు.

    Ajit Doval



  • May 07, 2025 18:26 IST

    Vinesh Phogat: ఆపరేషన్ సిందూర్‌పై వినేష్ ఫోగట్ సంచలన పోస్ట్.. శాంతి కావాలంటూ!

    ఆపరేషన్ సిందూర్‌పై భారత రెజ్లర్, ఎమ్మెల్యే వినేష్ ఫోగట్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రాణాలు పణంగాపెట్టి పోరాడుతున్న భారత సైన్యానికి సెల్యూట్. శాంతికోసం జరిగే పోరాటంలో దేవుడు మిమ్మల్ని రక్షించి, విజయం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.

    vinesh
    vinesh Photograph: (vinesh)

     



  • May 07, 2025 17:54 IST

    Operation Sindoor: ఎలా దాడి చేశామంటే.. అఫీషియల్ వీడియోలు రిలీస్ చేసిన ఆర్మీ (VIDEO)

    ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ రిలీస్ చేసింది. ఫైటర్ జెట్లలో నుంచి ఉగ్రవాద స్థావరాలను ఎలా టార్గెట్ చేసి దాడులు చేశారనేది ఇందులో ఉంది. ఆపరేషన్ సంబంధించిన వివరాలతో వీడియోలను ఆర్మీ ఎక్స్‌లో విడుదల చేసింది.

    OPERATION SINDOOR clips



  • May 07, 2025 17:06 IST

    Operation Sindoor: హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం: రాజ్‌నాథ్‌ సింగ్

    ఆపరేషన్ సిందూర్‌ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. అమాయకులను చంపినవాళ్లనే హతం చేశామని..హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు.

    Rajnath Singh Comments on Operation Sindoor
    Rajnath Singh Comments on Operation Sindoor

     



  • May 07, 2025 17:02 IST

    Operation Sindoor Attack: 4 డ్రోన్లు వ‌చ్చి తుక్కు తుక్కు చేశాయ్.. పాకిస్తాన్ ప్రత్యక్ష సాక్షి సంచలన వీడియో

    పాకిస్తాన్‌లోని మురిడ్కేలో ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ జరిపిన దాడిని తాను చూసిన ఒక వ్యక్తి అన్నాడు. నేను మొదట ఒక డ్రోన్ చూశాను. ఆ తర్వాత మరో మూడు డ్రోన్‌లు వచ్చాయి. అవి మసీదులపై దాడి చేయడంతో ప్రతిదీ ధ్వంసమైంది అని చెప్పుకొచ్చాడు. ఆ వీడియో వైరలవుతోంది.

    Operation Sindoor attack



  • May 07, 2025 16:43 IST

    Operation Sindoor: 1984 నాటి ముగ్గురు NDA బ్యాచ్‌మేట్స్.. ఆపరేషన్ సిందూర్ కథ నడిపింది వీరే!

    ఆపరేషన్‌ సిందూర్‌ను త్రివిధ దళాల అధిపతులు ప్లాన్ వేసి విజయవంతంగా అమలు చేశారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నావీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ అమర్‌ ప్రీత్‌.. ఈ ముగ్గురు కూడా 1984 NDA బ్యాచ్‌కు చెందినవారే.

    Upendra Dwivedi, Admiral Dinesh K Tripathi, Amar preet singh
    Upendra Dwivedi, Admiral Dinesh K Tripathi, Amar preet singh

     



  • May 07, 2025 16:43 IST

    Operation Sindoor: అమాయకులపై దాడి.. జమ్మూకశ్మీర్ సీఎం సంచలన కామెంట్స్

    ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాక్ జమ్ము కశ్మీర్‌లోని అమాయకపు ప్రజలపై కాల్పులు జరిపిందని CM ఒమర్ అబ్ధుల్లా అన్నారు. పాక్ ఆర్మీ కాల్పుల కారణంగా ముగ్గురు పౌరులు మరణించారు. ఉన్నతాధికారులతో సమీక్షించేందుకు ఒమర్‌ అబ్దుల్లా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

    Omar Abdullah 123



  • May 07, 2025 16:28 IST

    Hyderabad Mock Drills: హైదరాబాద్‌లో మోగిన మాక్ డ్రిల్ సైరన్‌

    హైదరాబాద్‌లో మాక్ డ్రిల్ సైరన్ మోగింది. నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌, కంచన్‌బాగ్‌ DRDA, గోల్కొండ, మౌలాలిలోని NFCలో డిఫెన్స్‌ బృందాలు మాక్‌డ్రిల్‌ ఏర్పాటు చేశారు. విశాఖలో రెండు చోట్ల మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించారు.

    Operation Sindoor (2)



  • May 07, 2025 15:47 IST

    Operation Sindoor: నాడు బాలాకోట్.. నేడు సిందూర్.. పాక్ ను చిత్తు చేసిన మోదీ వ్యూహం ఇదే!

    నాడు బాలాకోట్, నేడు సిందూర్ ఆపరేషన్‌తో మోదీ వ్యూహం పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో పాక్ విఫలమైంది. దాయాది దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో భారత ప్రధాని మరోసారి పైచేయి సాధించారు.  

    pm
    PM Modi

     



  • May 07, 2025 15:47 IST

    Pak TV Anchor Cries: భారత్ మెరుపు దాడి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ టీవీ యాంకర్ - VIDEO

    ఆపరేషన్ సిందూర్ అటాక్ తర్వాత పాకిస్తానీ టీవీ యాంకర్ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అమాయకులను చంపేస్తున్నారు, దేవుడా నువ్వే కాపాడు అంటూ కన్నీరు పెట్టుకుంది. మేము మానవులంతా ఒక్కటేనన్న విషయాన్ని మరచిపోయామని తెలిపింది.

    Operation Sindoor (1)



  • May 07, 2025 15:46 IST

    Operation Sindoor: సిగ్గు లేదు.. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ అధికారులు (VIDEO)

    పీఓకేలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు హాజరైయ్యారు. బిలాల్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ అధిపతి యాకుబ్ మొఘల్ చనిపోయిన విషయం తెలిసిందే. అతని అంతిమ సంస్కారాల్లో ISI, ఆర్మీ అధికారులు హాజరైయ్యారు.

    army officials attended Funeral



  • May 07, 2025 15:29 IST

    PM Modi : రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ.. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

    ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశం అయ్యారు. పాకిస్థాన్‌, POKలో ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన దాడుల గురించి ఆమెకు వివరించారు. కేంద్రం రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది.

    PM Modi Meets President Draupadi Murmu
    PM Modi Meets President Draupadi Murmu

     



  • May 07, 2025 15:29 IST

    Operation Sindoor: 'పాక్‌ను ఓడించండి' అన్నందుకు కత్తితో దాడి.. బాలుడిని దారుణంగా పొడిచి!

    యూపీ షాజహాన్‌పూర్‌లో ఘోరం జరిగింది. ఆపరేషన్ సిందూర్ అటాక్ నేపథ్యంలో 'పాకిస్తాన్‌ను ఓడించండి' అని నినాదాలు చేసిన 8ఏళ్ల సుర్జీత్‌ను మోహిద్ ఖాన్ కత్తితో పొడిచాడు. బాలుడి పరిస్థితి విషయమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

    up crime
    up crime Photograph: (up crime)

     



  • May 07, 2025 15:28 IST

    Operation Sindoor: ఎవరీ మసూద్ అజార్.. జైషే మహ్మద్ మాస్టర్ మైండ్ రహస్యాలివే..!

    జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం ఆపరేషన్ సిందూర్‌లో హత్మమైంది. ఇతన్ని 1994లో అరెస్ట్ చేశారు. కాందహార్‌లో విమానం హైజాక్ చేసి విడిపించుకున్నారు. పఠాన్‌కోట్, పుల్వామా, పార్లమెంట్‌ దాడుల వెనుక మసూద్ అజార్ మాస్టర్ మైండ్ ఉంది.

    masood azhar
    masood azhar

     



  • May 07, 2025 15:25 IST

    NARA LOKESH: మొక్క కూడా పీకలేరు.. లోకేష్ సంచలన ట్వీట్!



  • May 07, 2025 15:01 IST

    Operation Sindoor Videos: వెన్నులో వణుకుపుట్టించే ఆపరేషన్ సిందూర్ లైవ్ వీడియోస్.. చూస్తే గజగజ!

    ప‌హ‌ల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్‌ఫుల్‌గా విజయవంతమైంది. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేసిన మెరుపుదాడులతో పాకిస్థాన్‌ గజగజ వణికిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

    Operation Sindoor videos



  • May 07, 2025 14:58 IST

    𝐌𝐨𝐜𝐤 𝐃𝐫𝐢𝐥𝐥 𝐇𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝: మాక్ డ్రిల్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ పోలీసుల ట్వీట్



  • May 07, 2025 14:37 IST

    Operation Sindoor: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రధాని మోదీ.

     ఆపరేషన్ సింధూర్ పై రాష్ట్రపతికి వివరించిన మోదీ.

    Modi Operation Sindoor
    Modi Operation Sindoor

     



  • May 07, 2025 14:34 IST

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మిస్సైల్స్‌తో పాటు వాడిన పేలుడు పదార్థాలు ఏంటో తెలుసా?

    ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. అత్యాధునికమైన రాఫిల్ యుద్ధ విమానాలు ఉపయోగించి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో క్షిపణులతో పాటు మందుగుండు సామగ్రిని కూడా వినియోగించినట్లు తెలుస్తోంది.

    Operation Sindoor missiles
    Operation Sindoor missiles

     



  • May 07, 2025 14:26 IST

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. మృతదేహాలు మోసుకెళ్తున్న పాకిస్థానీయులు

    అనుకున్నట్లుగానే పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ గట్టి బదులిచ్చింది. పాకిస్థాన్, POKలోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాల నుంచి అక్కడి ప్రజలు మృతదేహాలను బయటకు తీస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.

    Operation Sindoor Success
    Operation Sindoor Success

     



  • May 07, 2025 13:58 IST

    యావత్ దేశానికే గర్వకారణం.. ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!

    పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సైన్యం అద్భుతంగా పని చేసిందని అన్నారు. ఇది యావత్ దేశానికి గర్వకారణమైన క్షణమని అభిప్రాయపడ్డారు.

    sindoor-modi
    sindoor-modi

     



  • May 07, 2025 13:56 IST

    మసూద్ అజహర్

    భారత ప్రధాని మోడీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేసిన మసూద్ అజహర్.. ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియామాలు ఉల్లంఘించారు.. నాకు భయం లేదు, నిరాశ లేదు, విచారం లేదంటూ లేఖలో పేర్కొన్న మసూద్.. ప్రధాని మోడీని, భారత్ ను నాశనం చేస్తానంటూ.. భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ లేఖలో మసూద్ ఓవర్ యాక్షన్..



  • May 07, 2025 13:39 IST

    Operation Sindoor: ఉద్యోగుల సెలవులు రద్దు.. వారంతా అరెస్ట్.. సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు!

    అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్నారు.

    Operation Sindoor Telangana CM Revanth Reddy
    Operation Sindoor Telangana CM Revanth Reddy

     



  • May 07, 2025 13:38 IST

    Operation Sindoor: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

    2016 నుంచి ఇండియా పాకిస్తాన్‌ టెర్రరిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పటి వరకు 3సార్లు POKలో ఉద్రవాద స్తావరాలపై స్ట్రైక్ చేసింది. ఉగ్రదాడి జరిగినప్పుడు 2016లో 11 రోజుల్లోనే, 2019లో 12 రోజుల్లోగా, 2025లో 14 రోజుల్లో ప్రతీకారం తీర్చుకుంది ఇండియన్ ఆర్మీ.

    Indian Army attacks 123



  • May 07, 2025 13:38 IST

    OPERATION SINDOOR: పాక్‌ - భారత్‌ మధ్య ఉద్రిక్తత.. ఐపీఎల్‌ ఆగిపోతుందా?

    భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 2025 సీజన్‌ కొనసాగుతుందా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది. అయితే ఈ ఉద్రిక్తల వల్ల ఐపీఎల్‌ 2025 సీజన్‌కు ఎలాంటి ఆటంకం ఉండబోదని బీసీసీఐ స్పష్టం చేసింది.

    2025 Indian Premier League
    2025 Indian Premier League

     



  • May 07, 2025 13:28 IST

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. నెట్టింట వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే

    పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ హల్‌చల్ చేస్తున్నాయి. ఉగ్రవాదులు దాడి చేస్తూ.. మీ మోదీకి చెప్పుకోండన్నారు. మోదీకి చెప్పామంటూ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    Operation Sindoor mems
    Operation Sindoor mems

     

     

     

     

     

     



  • May 07, 2025 13:18 IST

    పాకిస్తాన్‌ను నాశనం చేసిన LMS డ్రోన్ .. అసలు ఇది ఎలా పనిచేస్తుంది?

    LMS డ్రోన్ అంటే తక్కువ ఖర్చుతో కూడిన మినియేచర్ స్వార్మ్ డ్రోన్ లేదా లాటరింగ్ మునిషన్ సిస్టమ్. ఇది ఒక రకమైన సాయుధ డ్రోన్. పాకిస్తాన్‌పై జరిగిన ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి భారత్  దీనిని ఉపయోగించింది.

    lms-drone
    lms-drone

     



  • May 07, 2025 13:17 IST

    మాక్ డ్రిల్స్ రద్దు అంటూ ఫేక్ ప్రచారం.. ఖండించిన సైబరాబాద్ పోలీస్



  • May 07, 2025 13:09 IST

    Mohanlal Tweet



  • May 07, 2025 13:02 IST

    Operation Sindoor : ఇంకా చిత్రం మిగిలే ఉంది...ఆర్మీ మాజీ చిఫ్‌ మనోజ్‌ సంచలన ట్వీట్‌

    పాక్ పై భారత్‌ దాడుల నేపథ్యంలో భార‌త మాజీ ఆర్మీ చీఫ్ మ‌నోజ్ ముకుందే న‌ర‌వ‌ణే స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌ వేదికగా "అబీతో పిక్చర్‌ బాకీ హై' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. 

    Operation Sindoor
    Operation Sindoor

     



  • May 07, 2025 12:51 IST

    Operations Sindoor: గర్వపడుతున్నా.. ఆపరేషన్ సిందూర్ పై కేసీఆర్ ఎమోషనల్ పోస్ట్!



  • May 07, 2025 12:50 IST

    Operations Sindoor: గర్వపడుతున్నా.. ఆపరేషన్ సిందూర్ పై కేసీఆర్ ఎమోషనల్ పోస్ట్!

    ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానన్నారు.



  • May 07, 2025 12:50 IST

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మూడు దేశాల పర్యటన రద్దు.. మోదీ లైవ్!

    ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాలు క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. భారత్ పాక్‌పై దాడి చేపట్టడంతో యూరప్ పర్యటనను మోదీ రద్దు చేశారు. మే నెల మధ్యలో మళ్లీ ఈ పర్యటనను ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

    Modi Europe trip cancel
    Modi Europe trip cancel

     



  • May 07, 2025 12:49 IST

    Operation Sindoor : 23 నిమిషాలు..9 స్థావరాలు...90 మందికి పైగా ఉగ్రవాదులు

    పహెల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా కేవలం 23 నిమిషాల్లో భారత్ తన ఆపరేషన్ సిందూర్ ను పూర్తి చేసింది. పాకిస్థాన్ తో పాటు ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న 9 ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి చేసింది. ఈ దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మృతిచెందినట్లు తెలుస్తోంది.



  • May 07, 2025 12:49 IST

    Vyomika Singh : ఎవరీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ .. ఆపరేషన్ సిందూర్ తో ఆమెకు ఏంటీ సంబంధం ?

    వ్యోమిక సింగ్ ఆరో తరగతి నుంచి వైమానిక దళంలో చేరాలని కలలు కన్నారు.  ఆమె పేరు 'వ్యోమిక' అంటే 'ఆకాశంలో నివసించేది' అని అర్థం. వ్యోమిక సింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చేరారు. ఆమె కుటుంబంలో సాయుధ దళాలలో పనిచేసిన మొదటి సభ్యురాలు

    Wing Commander Vyomika Singh
    Wing Commander Vyomika Singh

     



  • May 07, 2025 12:35 IST

    #OperationSindoor పై పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన శుభం ద్వివేది భార్య షాకింగ్ కామెంట్స్..



  • May 07, 2025 12:33 IST

    Prime Minister Narendra Modi's Video Message



  • May 07, 2025 12:28 IST

    గర్వపడుతున్నా.. కేసీఆర్ పోస్ట్!



  • May 07, 2025 12:15 IST

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పవన్ కల్యాణ్ సంచలన పోస్ట్!

    ఆపరేషన్ సిందూర్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి మరియు వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు.. అంటూ తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

    Operation Sindoor Pawan Reaction
    Operation Sindoor Pawan Reaction

     



  • May 07, 2025 12:03 IST

    Operation Sindoor: జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది.. మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతం!

    ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌పై దాడులు నిర్వహించగా 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయిందని తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మృతి చెందారు.

    India Pakistan War Updates🔴LIVE : పాక్‌ కుక్కలు | Operation Sindoor | Masood Azhar | Hafiz Saeed



  • May 07, 2025 12:02 IST

    దెబ్బకు దిగొచ్చిన పాకిస్థాన్‌... దాడులు ఆపేస్తామని ప్రకటన

    భారత్ ప్రతీకార దాడితో పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కొంత బయపడినట్లు తెలుస్తోంది. భారత ఆర్మీ మంగళవారం రాత్రి పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేయడంతో కొంత వెనక్కు తగ్గింది. పాకిస్థాన్ కాల్పులు విరమించుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

     Operation Sindoor
    Operation Sindoor

     



  • May 07, 2025 11:56 IST

    మోదీకి థ్యాంక్స్.. ఆపరేషన్ సిందూర్ పై పవన్ ట్వీట్



  • May 07, 2025 11:55 IST

    ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్..

    ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు.. భారీగా క్షీణించిన పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ.. దాదాపు 6 శాతం మేర నష్టపోయిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు..



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు