/rtv/media/media_files/2025/05/07/qbrhLFD61UStYPZzsnTx.jpg)
Pakistan Terror Camps
పహల్గామ్ ఉగ్రదాడులకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రతీకారం ప్రారంభించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ వాటిని ధ్వంసం చేసింది. పాక్, పీఓకేలో మొత్తం 21 ఉగ్రవాద ట్రైనింగ్ శిబిరాలు ఉన్నట్లు భారత ప్రభుత్వం, సాయుధ దళాలు తాజాగా విలేకరుల సమావేశంలో తెలిపాయి. అవి ఉత్తరంలోని సవాయి నాలా నుంచి దక్షిణాన బహవల్‌పూర్ వరకు ఉన్నట్లు పేర్కొన్నాయి.
ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ
ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఉగ్రవాదులకు సంబంధించి 21 శిక్షణా శిబిరాల లిస్ట్‌ను పంచుకున్నాయి. గత 3 దశాబ్దాలుగా పాక్ క్రమపద్ధతిలో ఉగ్రవాద మౌలిక సదుపాయలు నిర్మించిందని తెలిపాయి. అంతేకాకుండా రిక్రూట్‌మెంట్, రిఫ్రెషర్ కోర్సులు, బోధనా కేంద్రాల కోసం ట్రైనింగ్ ప్రాంతాలు, హ్యాండ్లర్ల కోసం లాంచ ప్యాడ్లతో కూడిన వెబ్ ఇదంటూ భాదత సాయుధ దళాలు వెల్లడించాయి.
ఇది కూడా చూడండి: భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!
21 ఉగ్రవాద శిబిరాలు
సవాయ్ నాలా
సయ్యద్ నా బిలాల్
మష్కర్ ఈ అక్సా
చేలాబంది
అబ్దుల్లా బిన్ మసూద్
దులాయి
గర్హి హబీబుల్లా
బట్రాసి
బాలాకోట్
ఓఘి
బోయి
సెన్సా
గుల్పూర్
కోట్లి
బరాలీ
దంఘీ
బర్నాలా
మెహమూనా జోయా
సర్జల్
ముషిద్కే
బహవల్ పూర్
ఇది కూడా చూడండి: పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!
భారత్ దాడులు చేసిన 9 ఉగ్ర స్థావరాలు
మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్ పూర్ -జైషే మహ్మద్
మర్కజ్ తైబా,మురిడ్కే -లష్కరే తోయిబా
సర్జల్, తెహ్రా కలాన్ -జేఈఎం
మెహమూనా జోయా,సియాల్ కోట్ -హెచ్ ఎం
మర్కజ్‌అహ్లే హదిత్, బర్నాలా -లష్కరే తోయిబా
మర్కజ్‌అబ్బాస్, కోట్లి -జైషే మహ్మద్
మస్కర్ రహీల్ షాహిద్,కోట్లి -హెచ్ఎం
షావాయి నల్లా క్యాంప్,ముజఫరాబాద్ -లష్కరే తోయిబా
సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జైషే మహ్మద్
ఇది కూడా చూడండి: పాక్ పై భారత్ మెరుపు దాడి.. 30కి పైగా ఉగ్రవాదులు హతం!
operation Sindoor | operation sindoor latest | latest-telugu-news | telugu-news