PM Modi: నేపాల్ తాత్కాలిక ప్రధానికి మోదీ ఫోన్.. ఎందుకంటే?
నరేంద్ర మోడీ గురువారం నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కితో ఫోన్లో మాట్లాడారు. నేపాల్లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో మరణించిన వారికి ఆయన సంతాపం తెలిపారు. నేపాల్లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడానికి భారత్ అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు.