PM Modi: కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తే ఏదీ అసాధ్యం కాదు..ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే ఇదొక్కటే మార్గమని చెప్పారు. 10వ పాలకమండలి సమావేశంలో రాష్ట్రాల ప్రతినిధులతో ప్రధాని సమావేశమయ్యారు.