/rtv/media/media_files/2025/05/07/h8jFTU4rbjrXTTZsU0Sa.jpg)
sindoor-modi
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కేబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైన్యం అద్భుతంగా పని చేసిందని అన్నారు. ఇది యావత్ దేశానికి గర్వకారణమైన క్షణమని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోదీ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. భారత త్రివిధ సైన్యాలను అభినందించారు.
ఈ సమావేశానికి సంబంధించిన వీడియో కూడా బయటకువచ్చింది. ఈ సమావేశంలో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోడీకి కుడి వైపున, హోంమంత్రి అమిత్ షా ఎడమ వైపున కూర్చున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం గురించి ప్రధాని మోదీ తన మంత్రివర్గానికి చెప్పినప్పుడు, సభ్యులందరూ టేబుల్ చప్పట్లు కొట్టడం ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
दिल्ली: ऑपरेशन सिंदूर के बाद प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में केंद्रीय मंत्रिमंडल की बैठक हुई।#OperationSindoor #NarendraModi #CabinetMetting #Delhi #PMO #IndianArmedForces #IndianAttackOnPakistan | #Channel24Plus pic.twitter.com/NUT3GwgsdJ
— Channel 24+ News (@Channel24Plus) May 7, 2025
గురువారం అఖిలపక్ష సమావేశం
ఈ కేబినెట్ సమావేశం తర్వాత, ప్రధాని మోదీ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారని, దేశ ప్రస్తుత పరిస్థితుల గురించి సమాచారం ఇస్తారని సమాచారం. గురువారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొంటారు.
కాగా భారత సైన్యం నిన్న రాత్రి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలపై దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడిలో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం మొత్తం హతమైంది. అతని కుటుంబంలోని ఏకంగా 14 మంది సభ్యులు మరణించారు.
Jammu and Kashmir | operation Sindoor | pm-narendra-modi | telugu-news