AK-203 Rifle : భారత అమ్ములపొదిలో మరో ఆయుధం.. ఏకే 203... దీని ప్రత్యేకత ఏంటంటే?
భారత సైన్యం తన ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటోంది. అందులో భాగంగా కలాష్నికోవ్ సిరీస్లో అత్యాధునికమైన ఏకే-203 రైఫిళ్లను తయారు చేస్తోంది. నిమిషానికి 700 రౌండ్లు ఫైర్ చేయగల ఈ రైఫిల్లు త్వరలోనే సైన్యానికి చేరనున్నాయి.