Operation Sindoor: నాడు బాలాకోట్.. నేడు సిందూర్.. పాక్ ను చిత్తు చేసిన మోదీ వ్యూహం ఇదే!

నాడు బాలాకోట్, నేడు సిందూర్ ఆపరేషన్‌తో మోదీ వ్యూహం పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో పాక్ విఫలమైంది. దాయాది దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో భారత ప్రధాని మరోసారి పైచేయి సాధించారు.  

New Update
pm

PM Modi

Operation Sindoor: నాడు బాలాకోట్, నేడు సిందూర్ ఆపరేషన్‌తో మోదీ వ్యూహం పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో పాక్ విఫలమైంది. పాక్‌ దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో భారత ప్రధాని మోదీ మరోసారి పైచేయి సాధించారు.  

యావత్‌ భారత్ సంబరాలు..

పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం సిందూరుపై విరుచుకుపడింది. పాక్ లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసి వాటిని నేలమట్టం చేసింది. దీంతో యావత్‌ భారత్ సంతోషం వ్యక్తం చేస్తోంది. దాడుల ప్రణాళికలు పకడ్బంధీగా అమలుచేస్తుండగా ప్రధాని మోదీ సూచనలు ఇందులో కీలకంగా ఉన్నాయి. బాలాకోట్‌ అటాక్ సమయంలోనూ మోదీ వ్యూహాలే మంచి ఫలితాలిచ్చాయని, ఇప్పుడు మోదీ ప్లాన్ తో పాక్ ఖంగుతిన్నట్లు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి:భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

మీడియాతో ప్రశాంత ప్రసంగం..

ఆ నాడు పాకిస్థాన్‌ ఖైబర్‌పంఖ్తుంఖ్వా ఉగ్ర స్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి వ్యాఖ్యలు, సూచనలు చేయలేదు. రాత్రి 9 గంటలకు భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా.. ప్రధాని మాత్రం ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి, భారత ఆకాంక్షలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత సంకల్పం గురించి వివరించారు. ఆయలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. చాలా ప్రశాంతంగా ఉండటం విశేషం. 

ఇది కూడా చూడండి:Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఆందోళన లేని ముఖం..

ఇప్పుడు సిందూర్ అటాక్ ముందు మోదీ ప్రశాంతంగా కనిపించారు. దాడికి ఒక రోజు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ప్రసంగించగా మోదీ ముఖంలో ఏ మాత్రం టెన్షన్ కనిపించలేదు. ఇక దేశ ప్రజలను సైతం సైనిక చర్యకు మోదీ సిద్ధం చేస్తున్నారనే వార్తలు కూడా పాకిస్తాన్ ను ఏమార్చడానికి ఒక వ్యూహంగా నిపుణులు పేర్కొంటున్నారు. 

modi | pakistan | telugu-news | today telugu news

Advertisment