Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మూడు దేశాల పర్యటన రద్దు.. మోదీ లైవ్!

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాలు క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. భారత్ పాక్‌పై దాడి చేపట్టడంతో యూరప్ పర్యటనను మోదీ రద్దు చేశారు. మే నెల మధ్యలో మళ్లీ ఈ పర్యటనను ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

New Update

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాలు క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌ను భారత్ పాక్‌పై చేపట్టడంతో యూరప్ పర్యటనను మోదీ రద్దు చేశారు. మే నెల మధ్యలో మళ్లీ ఈ పర్యటనను ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దీనికి ముందు మోదీ తన రష్యా పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయం సాధించి 80 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా మే 9న మాస్కోలో జరిగే విజయ దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కావడం లేదు.

ఇది కూడా చూడండి:Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఇది కూడా చూడండి:BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

ఇది కూడా చూడండి:BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

వ్యతిరేకంగా దాడులు చేస్తూ..

ఇదిలా ఉండగా.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాన చర్య తీసుకుంటూ మే 07వ తేదీ బుధవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారత ఆర్మీ..  పాకిస్తాన్‌లోని 4 ప్రదేశాలను, పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది.అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను భారత్‌ టార్గెట్ చేసింది.  

Advertisment
తాజా కథనాలు