Operation Sindoor: జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది.. మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతం!

ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌పై దాడులు నిర్వహించగా 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్‌తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మృతి చెందారు.

author-image
By Kusuma
New Update
Operation Sindoor Masood Azhar family members are dead

Operation Sindoor Masood Azhar family members are dead

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపుగా 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్‌తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయిందని తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మృతి చెందినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఇది కూడా చూడండి: BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా..

ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉగ్ర దాడులు చేసింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కరులే అయినా...వెనుక ఉండి నడిపించింది మాత్రం హఫీజ్ అనే నిఘా వర్గాలు తెలిపాయి. అతనికి పాక్ ప్రభుత్వం భారీ భద్రత కల్పించడంతో ఈ అనుమానాలు మరింత నిజమయ్యాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ టార్గెట్‌లో ఖచ్చితంగా హఫీజ్ సయీద్ ఉన్నాడని తెలిసిన పాకిస్తాన్ ప్రభుత్వం.. ఐఎస్ఐ అతనికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు