/rtv/media/media_files/2025/05/07/sYsPxkgC2cTC9BaC8Krd.jpg)
Wing Commander Vyomika Singh
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ ఉగ్రవాదులపై ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీ బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ ఆపరేషన్లో, జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-తైబా,హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల రహస్య స్థావరాలను కూల్చివేశారు. ఈ చారిత్రాత్మక ఆపరేషన్ గురించి అధికారిక సమాచారాన్ని భారత సైన్యం ఇద్దరు మహిళా అధికారుల నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో అందించింది. ఇందులో ఒకరి పేరు సోఫియా ఖురేషి, మరొకరి పేరు వ్యోమికా సింగ్. సోఫియా ఖురేషి భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ కాగా, వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్.
ఆరో తరగతి నుంచి
వ్యోమిక సింగ్ ఆరో తరగతి నుంచి వైమానిక దళంలో చేరాలని కలలు కన్నారు. ఆమె పేరు 'వ్యోమిక' అంటే 'ఆకాశంలో నివసించేది' అని అర్థం. వ్యోమిక సింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చేరారు. వ్యోమిక సింగ్ 2004 డిసెంబర్ 18న భారత వైమానిక దళంలో చేరారు. ఆమె కుటుంబంలో సాయుధ దళాలలో పనిచేసిన మొదటి సభ్యురాలు ఈమెనే. వ్యోమిక సింగ్ తన 13వ సంవత్సర సర్వీసులో డిసెంబర్ 18, 2017న వింగ్ కమాండర్ హోదాకు పదోన్నతి పొందారు. ఈ పదోన్నతి ఆమె నిబద్ధత, సామర్థ్యం, అత్యుత్తమ సేవలకు నిదర్శనం అని చెప్పుకోవాలి.
వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ 2,500 కంటే ఎక్కువ ఫ్లయింగ్ అవర్స్ పూర్తి చేశారు. ఆమె జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోనిక్లిష్ట ప్రాంతాలలో చేతక్, చీతా హెలికాప్టర్లను నడిపారు. నవంబర్ 2020లో అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఒక ప్రధాన మిషన్తో సహా అనేక రెస్క్యూ ఆపరేషన్లలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది మాత్రమే కాదు, 2021లో వ్యోమికా సింగ్ 21,650 అడుగుల ఎత్తున్న మణిరాంగ్ పర్వతానికి త్రి-సేవల మహిళా పర్వతారోహణ యాత్రలో పాల్గొన్నారు..