/rtv/media/media_files/2025/05/07/GakC5v03QibNH0mvsrfO.jpg)
Three civilians killed
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాన చర్య తీసుకుంటూ మే 07వ తేదీ బుధవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. అయితే పాక్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు కూడా చనిపోయారు. జమ్మూ కశ్మీర్ లోని LOC వెంట ఉన్న ఉరి సెక్టార్ లో పాక్ ఆర్మీ ఆర్టిలరీ షెల్లింగ్స్ కాల్పులతో దాడికి పాల్పడింది. ఇందులో ముగ్గురు భారత పౌరులకు గాయలు కాగా మరికొంతమంది గాయపడ్డారు. ఇందుకు ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా బదులిస్తుంది.