BIG BREAKING: పాక్ పై భారత్ మెరుపు దాడి.. 30కి పైగా ఉగ్రవాదులు హతం!

భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటి వరకు 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లోని బహవల్ పూర్ లోని జైషే మహ్మద్ కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ దాడులు చేసింది. 

New Update
pak war with india

pak war with india

పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులు చేస్తోంది. ఇందులో ఇప్పటివరకు 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పాక్ మీడియా కూడా ధ్రువీకరించింది. పాకిస్తాన్ లోని బహవల్ పూర్ లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ హెడ్ క్వార్టర్స్,  జైషే మహ్మద్ కు చెందిన మదర్సాలో  ఉగ్రవాదులు ఉన్నట్లు భారత ఆర్మీకి పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతాల్లో భారత ఆర్మీ దాడులు చేసింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. అయితే ఉగ్రవాద శిబిరాల మీద తప్ప పాక్ సైన్యం మీద అటాక్ చేయలేదని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. 

 

today-latest-news-in-telugu | Indian Army | killed 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు