Operation Sindoor: 1984 నాటి ముగ్గురు NDA బ్యాచ్‌మేట్స్.. ఆపరేషన్ సిందూర్ కథ నడిపింది వీరే!

ఆపరేషన్‌ సిందూర్‌ను త్రివిధ దళాల అధిపతులు ప్లాన్ వేసి విజయవంతంగా అమలు చేశారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నావీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ అమర్‌ ప్రీత్‌.. ఈ ముగ్గురు కూడా 1984 NDA బ్యాచ్‌కు చెందినవారే.

New Update
Upendra Dwivedi, Admiral Dinesh K Tripathi, Amar preet singh

Upendra Dwivedi, Admiral Dinesh K Tripathi, Amar preet singh

బుధవారం తెల్లవారుజామున పాక్, POKపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సె్స్ అయ్యింది. 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు జరిగాయి. ఇండియన్ ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్‌.. త్రివిధ దళాలు కలిసి ఈ ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా అమలు చేశాయి. అయితే త్రివిధ దళాల అధిపతులు ముగ్గురు కూడా ఒకే బ్యాచ్‌మేట్స్‌ కావడం గమనార్హం. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఇండియన్ నావీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ అమర్‌ ప్రీత్‌ సింగ్.. ఈ ముగ్గురు కూడా 1984 నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) బ్యాచ్‌కు చెందినవారే. ఈ ముగ్గురే ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌ కథను వెనుక నుంచి నడిపించారు. 

ఉపేంద్ర ద్వివేది (ఆర్మీ చీఫ్)

ఉపేంద్ర ద్వివేది 2024 జూన్ 30న భారత సైన్యంలోని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS)గా నియమితులయ్యారు. ఈయన 1964లో మధ్యప్రదేశ్‌లోని రేవాలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు.ఆ తర్వాత 1973లో సైనిక్ స్కూల్‌లో అడ్మిషన్ పొందాడు. 1984 డిసెంబర్‌ 15న డెహ్రాడున్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) నుంచి జమ్మూ కశ్మీర్‌ రైఫిల్స్‌ 18వ బెటాలియన్‌లో నియమితులయ్యారు. ఈయనకు శారీరక శిక్షణలో బంగారు పతకం కూడా వచ్చింది. వ్యూహాత్మక అధ్యయనాలు, సైనిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఉపేంద్రకు ఎం.ఫిల్‌ డిగ్రీ పట్టా కూడా ఉంది. 39 ఏళ్ల తన సర్వీసులో ఆయన జమ్మూకశ్మీర్, LAC ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 

అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి (నావల్ స్టాఫ్ చీఫ్)

 అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి 2024 మే 30న నావల్ స్టాఫ్ (CNS) చీఫ్‌గా నియమితులయ్యారు. ఈయన 1964 మే 15న ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి ఉపాధ్యాయుడు. దినేష్ కుమార్ తన గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత 1973లో రేవాలోని సైనిక్ స్కూల్‌లో చేరాడు. వెల్లింగ్టన్‌లోని స్టాఫ్ కోర్సు ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC)లో పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత దినేష్ కుమార్ త్రిపాఠి పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)కి ఎంపికయ్యాడు. నావల్ హైయర్ కమాండ్ కోర్సు నుంచి నావల్ ఆపరేషన్లలో ఆయన శిక్షణ పొందారు. అలాగే పశ్చిమ నావల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా కూడా సేవలందించారు. 

అమర్ ప్రీత్ సింగ్ (చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్)

 2024, సెప్టెంబర్ 30న ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (CAS)గా నియమితులయ్యారు. ఈయన 1964, అక్టోబర్ 27న జన్మించారు. ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నుంచి ఆయన పట్టభద్రులయ్యారు. ఉపేంద్ర ద్వివేది, దినేష్ త్రిపాఠిలతో పాటు  ఈయన కూడా 1984 NDA బ్యాచ్‌మేట్. అయితే అమర్ ప్రీత్ సింగ్ శిక్షణ పొందిన యుద్ధ విమాన పైలట్. MiG-21, MiG-29, సుఖోయ్-30 MKI, ఇతర విమానాలను ఆయన నడిపాడు. అంతేకాదు టెస్ట్ పైలట్‌గా కూడా ఆయన పనిచేశాడు. దీంతోపాటు వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC), న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (NDC) నుండి శిక్షణ పొందారు. 

operation Sindoor | telugu-news | national | Indian Army | india pakistan war 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు