Operation Sindoor: ఎవరీ మసూద్ అజార్.. జైషే మహ్మద్ మాస్టర్ మైండ్ రహస్యాలివే..!

జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం ఆపరేషన్ సిందూర్‌లో హత్మమైంది. ఇతన్ని 1994లో అరెస్ట్ చేశారు. కాందహార్‌లో విమానం హైజాక్ చేసి విడిపించుకున్నారు. పఠాన్‌కోట్, పుల్వామా, పార్లమెంట్‌ దాడుల వెనుక మసూద్ అజార్ మాస్టర్ మైండ్ ఉంది.

author-image
By K Mohan
New Update
masood azhar

masood azhar

సామాన్యులను ఉగ్రవాదులుగా మార్చి భారత్‌పై దాడులకు ఉసిగొలిపే వారిలో జైష్- ఎ -మహ్మద్ మొదట ఉంటుంది. ఆ సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజార్. ఇతనో కరుడు గట్టిన ఉగ్రవాది.  సామాన్యుల మైండ్‌లో విషాన్ని నింపు ఉగ్రవాదులుగా మార్చుతాడు. ట్రైనింగ్ క్యాంపులు ఏర్పాటు చేసి మానవ బాంబులుగా తయారు చేస్తాడు. కాందహార్‌‌లో ఇండియా విమానం హైజాక్ నుంచి పఠాన్‌కోట్, పుల్వామా, పార్లమెంట్‌ అటాక్ వంటి పెద్ద పెద్ద దాడుల వెనుక ఈ మసూద్ అజార్ మాస్టర్ మైండ్ ఉంది. 

ఎయిర్ స్ట్రైక్‌లో ఫ్యామిలీ ఖతం

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఎయిర్ స్ట్రైక్ చేసింది భారత్. మే 6 అర్థరాత్రి 1.44 నిమిషాలకు పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ. ఈ దాడుల్లో మొత్తం 90 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జైష్- ఎ -మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబసభ్యులు 10 మంది ఆ అటాక్‌లో చనిపోయారని భారత బలగాలు దృవీకరించాయి. మసూద్ అజార్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, మరణించిన వారిలో తన అక్క, ఆమె భర్త, మసూద్ అజర్ మేనల్లుడు, అతని భార్య, మసూద్ మేనకోడలు, ఆమె ఐదుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు. దాడిలో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, మరో నలుగురు సహచరులు మరణించారని వెల్లడించారు. ఉగ్రవాది మసూద్ ముగ్గురు సన్నిహితులు కూడా హతమయ్యారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వీరితో పాటు ఒక సహోద్యోగి తల్లి కూడా మరణించింది.

పార్లమెంటు దాడితో పాటు పఠాన్‌కోట్, -పుల్వామా దాడికి కూడా అజార్ ప్రధాన సూత్రధారి. భారతదేశంలో జరిగిన ఒక ఉగ్రవాద దాడులకే కాదు, అనేక ఉగ్రవాద దాడులకు అజార్ బాధ్యత వహించాడు. మసూద్ భారతదేశంపై దాడులు చేయడానికి జైష్-ఎ-మహ్మద్ కార్యకర్తలను ఉపయోగించుకున్నాడు. అతను 2005లో అయోధ్యలోని రామజన్మభూమిపై, 2019లో పుల్వామాలో CRPF సైనికులపై కూడా దాడి చేశాడని ఢిల్లీ పోలీసుల చార్జిషీట్‌లో తెలిసింది. అంతేకాదు.. 2016లో ఉరి దాడికి, ఆఫ్ఘనిస్తాన్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని భారత కాన్సులేట్‌పై దాడికి కూడా మసూద్ బాధ్యత వహించాడు.

ఇండియాకు వచ్చి ఉగ్రదాడికి కుట్రలు

మసూద్ అజార్ తొలిసారిగా 1994 జనవరి 29న బంగ్లాదేశ్ ఢాకా నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. ఓ ఫేక్ ఐడెంటిటీ కార్డ్ ఉపయోగించి 1994లో అజార్ శ్రీనగర్‌లోకి ప్రవేశించాడు. ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నందుకు అతన్ని అనంతనాగ్‌లో అరెస్టు చేశారు. కాశ్మీర్‌ను విముక్తి చేయడానికి 12 దేశాల నుంచి ఇస్లాం సైనికులు వచ్చారని పోలీసుల కస్టడీలో ఉన్న అజార్ అన్నాడు. నాలుగు సంవత్సరాల తరువాత జూలై 1995లో జమ్మూ కాశ్మీర్‌‌కు వచ్చిన ఆరుగురు విదేశీ పర్యాటకులు కిడ్నాప్ చేయబడ్డారు. కిడ్నాపర్లు ఆ పర్యాటకుడిని విడిపించేందుకు బదులుగా మసూద్ అజార్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టులో ఇద్దరు పర్యాటకులు కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నారు. తర్వాత మిగిలిన వారి గురించి ఎలాంటి సమాచారం రాలేదు. 

విమానం హైజాక్ చేసి విడుదల

1999 డిసెంబర్ 24న ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న భారతీయ విమానాన్ని అజార్ సోదరుడు, ఇతర ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అతను దానిని ఆ సమయంలో తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లాడు. విమానంలో బంధించబడిన వ్యక్తులకు బదులుగా మసూద్ అజార్ సహా మరో ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేయాలనే డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల డిమాండ్లు నెరవేరాయి. మసూద్ విడుదలయ్యాడు. ఆ తర్వాత అతను పాకిస్తాన్ కు పారిపోయాడు. UNSCలో మసూద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా ప్రభుత్వం అనేకసార్లు కాపాడింది. 2009లో అజార్‌ను ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలనే ప్రతిపాదన మొదటిసారి వచ్చింది. ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు చైనా ఆ ప్రతిపాదనను ఆమోదించడానికి ఆధారాలు లేవని పేర్కొంటూ అనుమతించలేదు.

ప్రపంచ ఉగ్రవాదిగా మసూద్

2016 అక్టోబర్‌లో చైనా మళ్ళీ భారతదేశం ప్రతిపాదనను వ్యతిరేకించి, UNSCలో అజార్‌ను కాపాడింది. 2017లో అమెరికా UNSC లో అజార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలనే డిమాండ్‌ను లేవనెత్తింది. కానీ చైనా మళ్ళీ జోక్యం చేసుకుంది. చివరికి 2019 మేలో మసూద్‌ను UNSCలో ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించారు.

(operation sindoor live | operation Sindoor | Operation Sindoor briefing | operation sindoor air strike | jaish-e-mohammed-terrorists-killed | Masood Azhar | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు