అమాయకులపై దాడి.. జమ్మూకశ్మీర్ సీఎం సంచలన కామెంట్స్

ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాక్ జమ్ము కశ్మీర్‌లోని అమాయకపు ప్రజలపై కాల్పులు జరిపిందని CM ఒమర్ అబ్ధుల్లా అన్నారు. పాక్ ఆర్మీ కాల్పుల కారణంగా ముగ్గురు పౌరులు మరణించారు. ఉన్నతాధికారులతో సమీక్షించేందుకు ఒమర్‌ అబ్దుల్లా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

New Update
Omar Abdullah 123

జమ్మూకశ్మీర్‌ ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాకిస్థాన్‌‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులు జరిపింది. విచక్షణా రహితంగా ఫైరింగ్ చేసింది పాక్ సైన్యం. ఫిరంగి దాడుల్లో జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ముగ్గురు పౌరులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. దీనిపై సీఎం ఒమర్ అబ్దుల్లా సీరియస్ అయ్యారు. భారత్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం జమ్మూ కశ్మీర్‌లోని అమాయకపు పౌరులపై దాడులు చేస్తోందని ఆయన అన్నారు.

పాకిస్తాన్ భారతదేశంపై ఏకపక్ష, విచక్షణారహిత కాల్పులు దామాషా ప్రకారం లేవని అభివర్ణించారు.- పాకిస్తాన్ పౌరులకు, సైనికులకు ఎలాంటి నష్టం జరగకుండా ఇండియా ఎయిర్ స్ట్రైక్  చేస్తే.. పాకిస్తాన్ మాత్రం అమయకపు ప్రజలను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతుందని ఒమర్ అబ్ధుల్లా ఖండిచారు. భారతదేశం తగిన విధంగా దామాషా ప్రకారం స్పందించే హక్కును ఉపయోగిస్తుందని భావించారు. భారత ప్రభుత్వం, రక్షణ దళాలు తమ వంతు కృషి చేశాయని నేను భావిస్తున్నాను. వారు ఉగ్రవాద స్థావరాలు, లాంచ్ ప్యాడ్‌లను మాత్రమే ఢీకొట్టారు. దురదృష్టవశాత్తు, ప్రతిస్పందన దామాషా ప్రకారం లేదని సరిహద్దు మరియు నియంత్రణ రేఖ వెంబడి భద్రత మరియు సంసిద్ధతను అంచనా వేయడానికి ఒక సమావేశం నిర్వహించిన తర్వాత అబ్దుల్లా అన్నారు.

(Jammu and Kashmir | india pak war | pakistan attack | firing | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు