/rtv/media/media_files/2025/05/07/B7iS90FT0yb6BywnSkop.jpg)
Pakistan Army Chief Asim Munir
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరిట లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 రహస్య శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడిలో దాదాపు 70 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్థా్న్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్‌ను రెచ్చగెట్టేలా కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: 4 డ్రోన్లు వచ్చి తుక్కు తుక్కు చేశాయ్.. పాకిస్తాన్ ప్రత్యక్ష సాక్షి సంచలన వీడియో
గత నెలలో మునీర్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్ రెండు వేరు వేరు దేశాలని, హిందువులు ప్రతీ అంశంలో కూడా పాకిస్థాన్‌కు భిన్నంగా ఉంటారని వ్యాఖ్యానించారు. ప్రతీ పాకిస్థాన్ పౌరుడు కూడా రాబోయే తరాలకు దేశ చరిత్ర గురించి చెప్పాలని సూచించారు. దీనివల్ల వారు పాకిస్థాన్ ఎలా ఏర్పడిందనే విషయాన్ని మర్చిపోరని చెప్పారు. మన ఆచారాలు, సంప్రదాయాలు భిన్నమైనవని.. మన పూర్వీకులు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసేందుకు తమ జీవితాలు త్యాగం చేశారన్నారు.
ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన వారం రోజుల్లోనే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత కూడా అసిమ్ మూనీర్ భారత్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు. పాకిస్థాన్ భూమిలో ప్రతి అంగుళాన్ని మేము కాపాడుతామని.. భారత్‌కు తగిన సమాధానం చెబుతామన్నారు. అయితే తాజాగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. కానీ ఇప్పుడు అసిమ్ మునీర్ మౌనంగా ఉన్నాడు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన ఎక్కడా కూడా కనిపించలేదు. ఇటీవల అతడు దేశం విడిచి పారిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి.
Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
ఇదిలాఉండగా మంగళవారం అర్థరాత్రి దాటాక...బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ గాఢనిద్రలో ఉన్న సమయంలో సరిగ్గా 1.44 నిమిషాలకు ఏకకాలంలో పాకిస్థాన్ లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది.భారత్ సైన్యం పాక్ తో పాటుగా పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మట్టు బెట్టింది. ఈ తతంగమంతా కేవలం 23 నిమిషాల వ్యవధిలో నే పూర్తయింది. పహెల్గాం దాడి తర్వాత రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న పాక్ భారత దాడులను తిప్పికొట్టే పరిస్థితి లేకపోగా.. కనీసం ఒక విమానం కూడా ప్రతిగా పైకి లేవలేదు. 9 ప్రాంతాల్లోనూ ఎక్కడ భారత సైన్యానికి ప్రతిఘటన ఎదురుకాలేదు.
telugu-news | national-news | india-pakistan | operation Sindoor