Vinesh Phogat: ఆపరేషన్ సిందూర్‌పై వినేష్ ఫోగట్ సంచలన పోస్ట్.. శాంతి కావాలంటూ!

ఆపరేషన్ సిందూర్‌పై భారత రెజ్లర్, ఎమ్మెల్యే వినేష్ ఫోగట్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రాణాలు పణంగాపెట్టి పోరాడుతున్న భారత సైన్యానికి సెల్యూట్. శాంతికోసం జరిగే పోరాటంలో దేవుడు మిమ్మల్ని రక్షించి, విజయం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.

New Update
vinesh

vinesh Photograph: (vinesh)

Vinesh Phogat: ఆపరేషన్ సిందూర్‌పై భారత రెజ్లర్, జులానా ఎమ్మెల్యే వినేష్ ఫోగట్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. భారత సైన్యం చర్యకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని పొగిడారు. దేశంపై జరిగిన ఉగ్రవాద దాడికి భారత సైన్యం తన ప్రాణాలను పణంగా పెట్టి తగిన సమాధానం ఇస్తోందన్నారు. భారతమాత రక్షణ, మనందరి భద్రత, శాంతి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో త్వరలోనే విజయం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పింది. 

శాంతి కోసం పోరాటం..

ఈ మేరకు 'దేశంపై జరుగుతున్న ఉగ్రవాద దాడులకు భారత సైన్యం తన ప్రాణాలను పణంగా పెట్టి తగిన సమాధానం ఇస్తోంది. భారతమాత రక్షణ, మనందరి భద్రత, శాంతి కోసం జరిగే ఈ పోరాటంలో పాల్గొన్న మీ ధైర్య సాహసాలకు సెల్యూట్. దేవుడు మిమ్మల్ని అడుగడుగునా రక్షించి, త్వరలోనే విజయం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. జై హింద్, వందేమాతరం!' అంటూ పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

ఇక ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మే 6 అర్ధరాత్రి భారత సైన్యం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లోని ఉగ్రవాద స్థావరాలపై అనేక దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

ఇదిలా ఉంటే.. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ అనూహ్య పరిణామాలతో ఆమె ఫైనల్ ఫైట్ జరగకుండానే వెనుదిరిగింది. ఆ తర్వాత రాజకీయ ఇన్నింగ్స్ అద్భుతంగా ప్రారంభించింది.  కాంగ్రెస్ టిక్కెట్‌పై జులానా స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. జులనాలో వినేష్ ఫోగట్‌కు 65,080 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి యోగేష్ కుమార్ కు 59,065 ఓట్లు వచ్చాయి. వినేష్ 6015 ఓట్ల తేడాతో విజయం సాధించింది.

Also Read: 4 డ్రోన్లు వ‌చ్చి తుక్కు తుక్కు చేశాయ్.. పాకిస్తాన్ ప్రత్యక్ష సాక్షి సంచలన వీడియో

 vinesh-phogat | telugu-news | today telugu news

#telugu-news #vinesh-phogat #today telugu news #operation Sindoor
Advertisment
Advertisment
తాజా కథనాలు