హైదరాబాద్‌లో మాక్ డ్రిల్ సైరన్ మోగింది. నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. సికింద్రాబాద్, కంచన్‌బాగ్ DRDA, గోల్కొండ, మౌలాలిలోని NFCలో డిఫెన్స్ బృందాలు మాక్‌డ్రిల్ ఏర్పాటు చేశారు. విశాఖలో రెండు చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించారు. కొత్త జాలరు పేట, ఆక్సిజన్ టవర్స్ దగ్గర మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అత్యసవర సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
Also Read: యావత్ దేశానికే గర్వకారణం.. ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!
Hyderabad Mock Drills
ఇదిలా ఉంటే ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ఇవాళ ప్రారంభమైంది. పాకిస్తాన్‌తో యుద్ద వాతావరణం తీవ్ర ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా మొత్తం 244 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. సరిగ్గా 4గం. నుంచి 4:30 గం.ల వరకు మాక్ డ్రిల్ కొనసాగనుంది.
#Hyderabad: Police Commissioner @CVAnandIPS —-
— @Coreena Enet Suares (@CoreenaSuares2) May 7, 2025
-From 4 PM onwards the mock drills will be held in Greater Hyderabad.
-War & Industrial Siren will be played for 2 minutes at places mentioned
-Public Dont Panic
-Those in houses, remain indoors. Those outside try to look for… pic.twitter.com/NmjCfJbddL
Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
పహల్గాంలో ఉగ్రవాదుల ఎటాక్‌కు కౌంటర్‌గా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాయాది పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో మాక్ డ్రిల్ చేపట్టారు. తాజాగా ఈ ఆపరేషన్ అభ్యాస్ సైరన్ మోగింది. . .
india mock drill | mock drills in india | defence mock drills | latest-telugu-news | telugu-news | operation Sindoor