మంగళవారం అర్ధరాత్రి దాటక భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట విజయవంతంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 9 ప్రాంతాల్లో ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అయితే మళ్లీ ఆపరేషన్ సిందూర్ 2.0కు కూడా ఇండియా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోదాడికి భారత ఆర్మీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి లేదా మళ్లీ ఎప్పుడైనా పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు జరపనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ జరిగిన తర్వాత ఇది ట్రైలర్ మాత్రమేనని.. పిక్చర్ అబీ బాకీ హై అంటూ ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.
Also Read: పాకిస్థాన్‌కు మద్దతుగా రెండు దేశాలు.. భారత దాడులు ఖండిస్తూ సంచలన ప్రకటన
మరోవైపు పాక్, పీఓకేలో మొత్తం 21 ఉగ్రవాద ట్రైనింగ్ శిబిరాలు ఉన్నట్లు భారత ప్రభుత్వం, సాయుధ దళాలు తాజాగా మీడియా సమావేశంలో తెలిపాయి. అవి ఉత్తరంలోని సవాయి నాలా నుంచి దక్షిణాన బహవల్‌పూర్ వరకు ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే తాజాగా 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
telugu-news | rtv-news | national-news | operation Sindoor | india pakistan