🔴Live Breakings: పట్టపగలే దారుణ హత్య.. ప్రియురాలిని నరికి చంపిన మాజీ ప్రియుడు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Live Breakings

  • Jul 02, 2025 15:26 IST

    E Nagaraniki emindi sequal: క్రేజీ కాంబో.. ఇద్దరు మాస్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో.. థియేటర్లు దద్దరుల్లే!

    'ఈ నగరానికి ఏమైంది' మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న 'ENE REPEAT' లో విశ్వక్‌సేన్‌తో పాటు బాలకృష్ణ కూడా కనిపించనున్నట్లు సమాచారం. కామియో గెస్ట్ రోల్‌లో కొన్ని నిమిషాల పాటు బాలయ్య బాబు ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది.

    Balakrishna&Vishwak sen



  • Jul 02, 2025 15:25 IST

    Crime News: పట్టపగలే దారుణ హత్య.. ప్రియురాలిని నరికి చంపిన మాజీ ప్రియుడు

    రాజస్థాన్‌లో లీలా తబియార్‌కు తన భర్తతో విడాకులు కావడంతో మహిపాల్ అనే వ్యక్తితో కొన్ని రోజుల పాటు సహజీనవం చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మహిపాల్ లీలాపై దాడి చేశాడు. రెండేళ్ల పాటు జైలులో ఉండి ఇటీవల బయటకు రాగా ఆమెను నడిరోడ్డుపై నరికి చంపాడు.

     

    Rajastan
    Rajastan

     



  • Jul 02, 2025 15:25 IST

    Peter Henry Schroder: హాలీవుడ్‌ స్టార్ నటుడు కన్ను మూత!

    హాలీవుడ్ స్టార్ నటుడు పీటర్ హెన్రీ స్ట్రోడర్ (90) ఫ్లోరిడాలో కన్నుమూశారు. హెన్రీ మృతి చెందడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్ట్రోడర్ కేవలం వెండితెరపైనే కాదు, దేశ సైన్యంలో కూడా పనిచేశారు. నిజ జీవితంలో సేవలు అందించి హెన్రీ రియల్ హీరోగా నిలిచారు.

     

    peter henry schroede
    peter henry schroede

     



  • Jul 02, 2025 15:21 IST

    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు జైలు శిక్ష

    బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితి కారణంగా ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నది.

    Sheikh Hasina



  • Jul 02, 2025 15:21 IST

    POK: పాకిస్తాన్ పరిస్థితి ఇంత దారుణమా.. అమ్మకానికి POK

    పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశం అప్పల ఊబిలో కూరుకుపోయింది. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో భూములు, ఆస్తులు అమ్మకం పెట్టడానికి పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. పాకిస్తాన్ POKలోని రాజా హరిసింగ్ ఆస్తులను అమ్మకానికి పెడుతుంది.

    POK



  • Jul 02, 2025 15:20 IST

    Ramayana Glimpse:'రామాయణం' ఫస్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్..! భారీగా ఏర్పాట్లు

    రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'రామాయణం' సినిమాపై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. జులై 3న మూవీ గ్లింప్స్, టైటిల్ లోగోను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

     

    Bollywood Ramayana Glimpse Update
    Bollywood Ramayana Glimpse Update

     



  • Jul 02, 2025 15:19 IST

    CM Chandrababu: సామాన్యుడు పోశిబాబు బాబు ఇంట్లో చంద్రబాబు.. అక్కడ ఏం చేశారో చూడండి! ఫొటోలు వైరల్

    ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిన్న తూర్పు గోదావరి జిల్లా కొవ్వురును పర్యటించారు. అక్కడ ప్రజల చెంతకే వెళ్లి వారి వ్యాపారాలు బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న చర్మకారుడు పోశిబాబును ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాయి.

     

    cm Chandrababu naidu Kovvur visit pic four
    cm Chandrababu

     



  • Jul 02, 2025 15:14 IST

    Vivo T4 Lite 5G: ఖతర్నాక్.. AI ఫీచర్స్, 50MP కెమెరా వివో ఫోన్ పై అదిరిపోయే ఆఫర్లు - ఫీచర్లు సూపరెహే!

    Vivo T4 Lite 5G స్మార్ట్ ఫోన్ సేల్ ఇవాళ ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభమైంది. 4/128GB ధర రూ.9,999, 6/128GB ధర రూ.10,999, 8/256GB ధర రూ.12,999కు లభిస్తుంది. దీనిపై రూ.500 బ్యాంక్ ఆఫర్ ఉంది. ఇది 50mp కెమెరా, 6,000mAh బ్యాటరీ, AI ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.

     

    Vivo T4 Lite 5G sale started today on flipkart
    Vivo T4 Lite 5G

     



  • Jul 02, 2025 15:11 IST

    Bombay High Court: అలా చేస్తే లైంగికంగా వేధించినట్లు కాదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

    బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదని వ్యాఖ్యానించింది. మైనర్ అమ్మాయికి I love you చెప్పినంత మాత్రాన వేధింపులకు గురి చేసినట్లు కాదని తేల్చి చెప్పింది. ఓ యువకుడి కేసులో బాంబే హైకోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది.

     

    Bombay High Court sensational verdict saying i love you is not sexual harassment
    Bombay High Court sensational verdict saying i love you is not sexual harassment

     



  • Jul 02, 2025 14:40 IST

    INS Tamal: రష్యా నుంచి ఇండియన్‌ నేవీలోకి INS తమల్‌

    రష్యాలోని కాలివిన్‌గ్రాడ్‌లో INS తమల్‌ జలప్రవేశం చేసింది. రక్షణ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక సాంకేతికతో రష్యా ఇండియాకు ఇది రూపొందించింది. అరేబియా, సౌత్‌ హిందూ మహాసముద్రంలో INS తమల్ కాపలా కాయనుంది. రష్యాలో 3 నెలల పాటు కఠిన సముద్ర పరీక్షలు విజయవంతమయ్యాయి.

    INS tamal



  • Jul 02, 2025 13:50 IST

    పట్టపగలే దారుణ హత్య.. ప్రియురాలిని నరికి చంపిన మాజీ ప్రియుడు

    రాజస్థాన్‌లో లీలా తబియార్‌కు తన భర్తతో విడాకులు కావడంతో మహిపాల్ అనే వ్యక్తితో కొన్ని రోజుల పాటు సహజీనవం చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మహిపాల్ లీలాపై దాడి చేశాడు. రెండేళ్ల పాటు జైలులో ఉండి ఇటీవల బయటకు రాగా ఆమెను నడిరోడ్డుపై నరికి చంపాడు.

     

    Rajastan
    Rajastan

     



  • Jul 02, 2025 13:40 IST

    పటాన్‌ చెరు అస్పత్రి వద్ద ఉద్రిక్తత.. ప్యాక్టరీ వైస్‌ చైర్మన్‌ను అడ్డుకున్న కార్మికులు

    పటాన్ చెరు ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్మికులను పరమార్శించడానికి వచ్చిన సిగాచి కంపెనీ వైస్‌ చైర్మన్‌చిదంబర్‌ నాథన్‌ను కార్మిక కుటుంబాలు అడ్డుకున్నాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు ఆయనతో వాగ్వాదానికి దిగారు.

    Sigachi Blast



  • Jul 02, 2025 12:15 IST

    పాశమైలారంలో ఉద్రిక్తత. ఎండీపై సర్కార్‌ సీరియస్‌

    సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 36మంది మరణించినట్లు ఉన్నా..అంతకంటే ఎక్కువమందే చనిపోయారని తెలుస్తోంది.మరోవైపు తమవాళ్ల ఆచూకీ చెప్పాలంటూ పరిశ్రమ వద్ద బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి.

    pashamylam



  • Jul 02, 2025 12:02 IST

    రైతులకు కేసీఆర్‌ మరణశాసనం: సీఎం సంచలన కామెంట్స్!

    కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టుపెట్టి తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణ శాసనం రాశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 811 టీఎంసీలలో తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉందని చెప్పారు.

    deccanherald2025-06-11n0g8xeyytg



  • Jul 02, 2025 12:02 IST

    మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!

    భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నప్ప చిత్రం కలెక్షన్లు డౌన్ అయ్యాయి. మొదటి రోజున ఈ చిత్రం రూ. 9.25 కోట్లు రాబట్టగా...సోమవారం రూ. 2.3 కోట్లు, మంగళవారం 1.46 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

    kannappa

     

     



  • Jul 02, 2025 12:01 IST

    'ఐ లవ్‌ యూ' చెప్పడం లైంగిక వేధింపు కాదు: హైకోర్టు

    మైనర్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన యువకుడి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2015 అక్టోబర్‌లో 11వ తరగతి చదువుతున్న మైనర్ కూతురికి ఒక అబ్బాయి ఐ లవ్ యూ చెప్పి, లైంగికంగా వేధించాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    Gu04uhDWQAAyCbt



  • Jul 02, 2025 12:00 IST

    తులం బంగారం కోసం వేధించారు..పెళ్లైన నాలుగోరోజే నవవధువు సూసైడ్

    తమిళనాడులో మరో ఘోరం జరిగింది. తులం బంగారం కోసం భర్త, అత్తమామలు వేధించడంతో లోకేశ్వరి అనే మహిళ పెళ్ళైన నాలుగు రోజులకే ఉరేసుకొని చనిపోయింది. లోకేశ్వరికి జూన్ 27న పన్నీర్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది.

     

    tamil nadu crime
    tamil nadu crime

     



  • Jul 02, 2025 11:59 IST

    ఛీ వీడూ తండ్రేనా.. టైమ్‌కు నిద్ర పోవడంలేదని చిన్నారికి నరకం

    కన్నపిల్లలను అల్లారుముద్దుగా చూసుకునే తల్లిదండ్రులుంటారు. వారికి ఏ చిన్న ఇబ్బంది జరిగినా వారు కుమిలిపోతారు. అటువంటిది ఓ తండ్రి మాత్రం ఐదేండ్ల కూతురును చిత్రహింసలకు గురిచేయడం సంచలనంగా మారింది. ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

    Father who tortured his daughter



  • Jul 02, 2025 11:59 IST

    కాలు నరికి.. బైక్ పై ఊరేగించిన నిందితులు: భయంకరమైన వీడియో

    కర్నూల్‌ జిల్లాలో భయంకరమైన మర్డర్ జరిగింది. సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శేషన్న (54) అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హతమార్చారు. అర్ధరాత్రి దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి కొడవళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. 

    murder



  • Jul 02, 2025 11:09 IST

    ఫిష్ వెంకట్ కి సీరియస్.. వెంటిలేటర్ పై చికిత్స

    టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్సపొందుతున్నట్లు సమాచారం. ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో వారం రోజులుగా వెంటిలేటర్‌పైనే ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.

     

    actor fish venkat
    actor fish venkat

     



  • Jul 02, 2025 11:07 IST

    పోలీస్‌ స్టేషన్ల లేక సెటిల్‌మెంట్ల అడ్డాలా? హైకోర్టు ఆగ్రహం!

    తెలంగాణ పోలీసులు, పోలీస్ట్ స్టేషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్లు సెటిల్‌మెంట్ అడ్డాలుగా మారాయని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు జారీచేసిన ఇంజంక్షన్‌ ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకుంటున్నాయి.



  • Jul 02, 2025 11:06 IST

    శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుకూలించని వాతావరణం..పలు విమానాల మళ్లింపు

    శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలు దారిమళ్లించారు. ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలను బెంగళూరుకు మళ్లించారు. వాటిలో మంబాయి-శంషాబాద్‌ , వైజాగ్‌-శంషాబాద్‌, జైపూర్‌ -శంషాబాద్‌ లున్నాయి.

     

    Shamshabad Airport
    Shamshabad Airport

     



  • Jul 02, 2025 10:30 IST

    మేడారం మహా జాతర తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?

    ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర వచ్చే ఏడాది జరగనుంది. ప్రతి రెండు సంవ్సరాలకు ఒకసారి జరిగేఈ జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకుఈ  జాతర జరగనుంది.

    Medaram jatara



  • Jul 02, 2025 10:30 IST

    వారికి ప్రతి నెలా రూ.4 ల‌క్షలు ఇవ్వండి.. ష‌మీకి హైకోర్టు ఆదేశాలు!

    భారత క్రికెటర్ షమీకి కోల్‌క‌తా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మాజీ భార్య, కూతురుకు ఖర్చులకోసం ప్రతినెల రూ. 4 ల‌క్షలు ఇవ్వాలని ఆదేశించింది. హ‌సిన్ జ‌హాన్‌ను 2014లో ష‌మీ పెళ్లి చేసుకోగా కొంతకాలానికి ఇరువురి మధ్య విభేధాలు మొదలయ్యాయి.

    mohammed-shami-facebook_806x605



  • Jul 02, 2025 10:29 IST

    అమెరికాలో దారుణం.. ఇస్కాన్ దేవాల‌యం పై కాల్పులు

    మెరికాలో ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు కలకలం రేపాయి. అగ్రదేశంలోని శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్‌ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగపడ్డారు. ఆల‌యంలో భ‌క్తులు ఉన్న స‌మ‌యంలోనే ఈ కాల్పులు చోటు చేసుకోవడం సంచలనం సృష్టించింది.

    The ISKCON Sri Sri Radha Krishna Temple in Spanish Fork



  • Jul 02, 2025 10:28 IST

    నాలుగు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ



  • Jul 02, 2025 10:28 IST

    మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

    మోదీకి డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌పై 500 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. త్వరలోనే యూఎస్‌ సెనేట్‌లో దీనిపై బిల్లు తెస్తామని లిండ్సే తెలిపారు.

     



  • Jul 02, 2025 09:08 IST

    ఛాతిపై కూర్చొని.. గొంతు కోసిన యువకుడు - వీడియోలు తీసిన జనం

    మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ దవాఖానలో ఘోరం చోటుచేసుకుంది. ఆసుపత్రి నిండా జనం ఉండగానే, అందరూ చూస్తుండగానే ఒక యువతిపై దాడి చేసిన యువకుడు యువతి గొంతుకోసి హత్య చేయడం సంచలనం సృష్టించింది.

    Madhya Pradesh murder)



  • Jul 02, 2025 09:07 IST

    తల్లి అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, రెజ్లర్!

    మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ పండటి బిడ్డకు జన్మనిచ్చారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఫొగట్ దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. 2018లో సోమవర్ రథీని వినేశ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

    vinesh

     



  • Jul 02, 2025 09:06 IST

    సర్దేసుకుని వెళ్లిపోతావ్ హెచ్చరించిన ట్రంప్‌..వెనక్కి తగ్గిన మస్క్‌

    ఒకప్పటి స్నేహితులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. మరోసారి ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకోవడంతో భేదాభిప్రాయలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

    Elon Musk And Trump



  • Jul 02, 2025 08:04 IST

    జూన్ లో భారీగా పెరిగిన శ్రీవారి ఆదాయం

    జూన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం భారీగా పెరిగింది. వేసవి సెలవులు ముగిసి, తిరిగి పాఠశాలలు ప్రారంభమవడంతో గడచిన నెలలో 24.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో టీటీడీకి రూ.119.86 కోట్లు ఆదాయం వచ్చింది.

     

    Tirumala Tirupati Devasthanams .
    Tirumala Tirupati Devasthanams .

     



  • Jul 02, 2025 08:03 IST

    ఆన్‌లైన్ టికెట్లపై TTD కీలక ప్రకటన!

    ఆన్‌లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

    Tirupati Laddu



  • Jul 02, 2025 07:34 IST

    పాకిస్థాన్‌ నటినంటూ పరిచయం.. రూ.21.74 లక్షల టోకరా

    పాకిస్థాన్ నటి పర్వరీష్‌ షా చిత్రాలను డీపీగా పెట్టుకుని పెళ్లి చేసుకుంటామని అమాయకులను మోసం చేస్తున్నారు ఇద్దరు కిలాడీలు. నమ్మించి వారి వద్ద లక్షలు కొట్టేస్తున్నారు. అలా ఒక యువకుడిని మోసం చేసి రూ.21.74లక్షలు కోట్టేసిన ఘటన కలకలం సృష్టించింది

    Parwarish



  • Jul 02, 2025 07:32 IST

    నేటి నుంచి రెండో టెస్టు.. భారత జట్టులో భారీ మార్పులు?

    ఇంగ్లాండ్-ఇండియా మధ్య నేటినుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనున్న మ్యాచ్ పై భారీ అంచనాలున్నాయి. ఈ గ్రౌండ్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లో భారత్ 7 ఓడిపోగా 1 మ్యాచ్ డ్రా చేసుకుంది.

     

    IND VS ENG TEST SERIES 2025
    IND VS ENG TEST SERIES 2025

     



  • Jul 02, 2025 07:14 IST

    గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ: ట్రంప్‌ పోస్టు

    గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. అయితే షరతులు ఎలాంటివనేది మాత్రం వివరించలేదు.

     

    israel
    Attacks On Gaza

     



Advertisment
Advertisment
తాజా కథనాలు