Infosys Techie: లేడీస్ బాత్‌రూమ్‌లో ఏపీ టెకీ పాడుపని.. చివరికి ఇలా దొరికేశాడు

ఏపీకి చెందిన నగేష్‌ స్వప్నిల్‌ మాలి అనే టెకీ బెంగళూరులో పాడుపని చేస్తూ పట్టుబడ్డాడు. ఇన్ఫోసిస్‌‌ కంపెనీలోని వాష్‌రూమ్‌లో సీక్రెట్‌గా మహిళల వీడియోలు రికార్డ్ చేస్తూ చిక్కాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.

New Update
Infosys Techie Arrested For Secretly Filming Woman In Washroom In Bengaluru

Infosys Techie Arrested For Secretly Filming Woman In Washroom In Bengaluru

ఏపీకి చెందిన ఓ టెకీ బెంగళూరులోని ఒక పెద్ద కంపెనీలో పాడు పని చేస్తూ పట్టుబడ్డాడు. ఏకంగా మహిళల వాష్ రూమ్‌లో సీక్రెట్‌గా వీడియోలు రికార్డ్ చేస్తూ చిక్కాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

మహిళల వాష్ రూమ్‌లో వీడియో రికార్డ్

ఏపీకి చెందిన 28 ఏళ్ల నగేష్‌ స్వప్నిల్‌ మాలి బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీలోని ఇన్ఫోసిస్‌‌లో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఎవరికీ తెలియకుండా ఆఫీస్‌‌లోని వాష్ రూమ్‌లో మహిళా ఉద్యోగుల వీడియోలను రికార్డు చేశాడు. మొదట ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. కానీ జూన్ 30వ తేదీన ఓ మహిళా ఉద్యోగి వాష్ రూమ్‌కి వెళ్లారు. 

అక్కడ ఏదో అసాధారణంగా ఆమెకు కనిపించింది. ఎదురుగా ఉన్న గోడలో నుంచి సీక్రెట్‌గా ఎవరో రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించారు. అలా దగ్గరకు వెళ్లి చూడగా.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. గోడకు అవతలవైపు ఓ వ్యక్తి ఫోన్‌లో సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేస్తున్నట్లు కనిపించడంతో ఖంగుతిన్నారు. వెంటనే గట్టిగా కేకలు వేశారు. దీంతో సహుద్యోగులు అక్కడికి చేరుకుని నగేష్‌ స్వప్నిల్‌‌ను పట్టుకున్నారు. 

అతడిని గట్టిగా ప్రశ్నించడంతో తప్పు ఒప్పుకుని అక్కడికక్కడే క్షమాపణలు చెప్పాడు. అనంతరం ఈ ఘటనపై బాధితురాలు ఇన్ఫోసిస్ హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్‌కు తెలిపింది. దీంతో HR బృందం అతడి మొబైల్ తీసుకుని చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. అందులో దాదాపు 30కి పైగా మహిళల అసభ్య వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో.. నిందితుడ్ని అరెస్టు చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు