/rtv/media/media_files/2025/07/02/pawan-kalyan-og-movie-release-date-postpone-rumour-news-2025-07-02-21-03-08.jpg)
Pawan Kalyan OG Movie release date postpone rumour news
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజకీయలు, మరోవైపు తాను ఒప్పుకున్న సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సైతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
Pawan Kalyan OG Movie
ఇందులో మరో మోస్ట్ వైలెంటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’ (OG Movie). ఇప్పుడంతా ఈ సినిమా గురించే చూస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇది చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు పవన్ పై చిత్రీకరించి షూటింగ్‌ను క్లోజ్ చేయబోతున్నారు.
Rumours ni Nammakandi… #TheyCallHimOG arrives on Sept 25th!!🤟🏻 #OGpic.twitter.com/JPEyE3SSqe
— DVV Entertainment (@DVVMovies) July 2, 2025
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియో సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే’ అంటూ సాగే సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇదిలా ఉంటే తరచూ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక గాసిప్ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరొక రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ రూమర్స్ పై ‘ఓజీ’ మూవీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ రియాక్ట్ అయింది. రూమర్స్ నమ్మకండి.. ఈ సినిమా అనుకున్న సమయానికి అంటే సెప్టెంబర్ 25నే రిలీజ్ అవుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.