రైతులకు కేసీఆర్‌ మరణశాసనం: సీఎం సంచలన కామెంట్స్!

కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టుపెట్టి తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణ శాసనం రాశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 811 టీఎంసీలలో తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉందని చెప్పారు.

New Update
deccanherald2025-06-11n0g8xeyytg

Tg News: కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టుపెట్టి తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణ శాసనం రాశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 811 టీఎంసీలలో తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉందని చెప్పారు. కానీ 299 టీఎంసీలు చాలని కేసీఆర్, హరీష్ రావు 2015లో ఒప్పంద పత్రాలు రాసిచ్చారని ఆరోపించారు.

ఇది కూడా చూడండి:Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!

ఈ మేరకు కృష్ణా, గోదావరి జలాలపై అధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి.. గోదావరిలో 3వేల టీఎంసీల వరద నీరు సముద్రంలోకి వెళ్తోందన్నారు. ఈ నీటిని రాయలసీమకు మళ్లించుకోవచ్చని 2016లో ఎపెక్స్‌ కౌన్సిల్‌లో చెప్పారు. ఈ విషయాన్ని మినిట్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. 2019లో గోదావరి నీటిని మళ్లించి రాయలసీమను రతనాల సీమగా చేయాలని కేసీఆర్‌ సూచించారు. కృష్ణా, గోదావరి జలాలపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కేంద్రం చోద్యం చూస్తోంది. తెలంగాణ హక్కులను కాలరాయడానికి 8 మంది ఎంపీలను బీజేపీకి ఇవ్వలేదన్నారు. ఇక బీఆర్ఎస్ ను బతికించడానికి కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

కృష్ణా, గోదావరిలో తెలంగాణ హక్కులను రక్షించుకోవడానికి కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తేవాలని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అబద్ధాలతో నీటి సెంటిమెంట్‌ను రగల్చడానికి ప్రయత్నిస్తున్నారని, అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు. 

Advertisment
తాజా కథనాలు