/rtv/media/media_files/2025/07/02/ind-vs-eng-2nd-test-team-india-scored-182-runs-for-the-loss-of-3-wickets-at-the-tea-break-2025-07-02-20-36-14.jpg)
IND VS ENG 2ND TEST Team India scored 182 runs for the loss of 3 wickets at the tea break
ఇంగ్లాండ్ - టీమ్‌ఇండియా (India vs England) జట్ల మధ్య రెండో టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చారు. అయిదు ఓవర్లకు టీమ్ఇండియా 9 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఇంతలోనే టీమ్ఇండియాకు గట్టి షాక్ తగిలింది.
Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
IND VS ENG 2ND TEST
ఓపెనర్ కేఎల్ రాహుల్ (2పరుగులు; 26 బంతుల్లో) వెనుదిరిగాడు. క్రిస్ వోక్స్ వేసిన బంతిని (8.4 ఓవర్) డిఫెన్స్ చేయబోయి బౌల్డయ్యాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ క్రీజులోకి వచ్చాడు. దీంతో జైస్వాల్, నాయర్ నిలకడగా ఆడారు. అదే సమయంలో యశస్వి జైస్వాల్ 59 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!
అప్పుడే టీమిండియాకు మరో షాక్ తగిలింది. కరుణ్ నాయర్ (31; 50 బంతుల్లో) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 95 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఆ తర్వాత గిల్ క్రీజులోకి వచ్చాడు. అనంతరం 30 ఓవర్లకు భారత స్కోరు 111 పరుగులుగా ఉంది.
Also Read : మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!
ఇక క్రీజ్‌లో గిల్, జైస్వాల్ భాగస్వామ్యం అద్భుతంగా ఉందనుకునేలోపే మరో వికెట్ డౌన్ అయింది. యశస్వి జైస్వాల్ (87) ఔట్ అయ్యాడు. జైస్వాల్ (87; 107 బంతుల్లో) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం రిషభ్ పంత్ క్రీజ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం రిషభ్ పంత్ (14), శుభ్‌మన్ గిల్ (42) క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆట టీ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.