/rtv/media/media_files/2025/07/02/parwarish-2025-07-02-07-29-41.jpg)
Parwarish
మోసపోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటనే ఉంటారు. పాకిస్థాన్ నటి పర్వరీష్ షా పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసి రూ.21.74లక్షలు కోట్టేసిన ఘటన కలకలం సృష్టించింది. నటి పర్వరీష్ షా చిత్రాలను డీపీగా పెట్టుకుని పెళ్లి చేసుకుంటామని అమాయకులను మోసం చేస్తున్నారు ఇద్దరు కిలాడీలు. నమ్మించి వారి వద్ద లక్షలు కొట్టేస్తు్న్నారు. ఎదుటివారు ఎవరు అని తెలుసుకోకుండా ఈ ఉచ్చులో చిక్కుకున్నాడు ఒక అమాయకుడు.
ఇది కూడా చదవండి: భద్రం బీకేర్ఫుల్.. గుండె ఆరోగ్యం కోసం పంచ రత్నాల వంటి అలవాట్లను తెలుసుకోండి.
Introducing As A Pakistani Actress
బహదూర్‌పురాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి మ్యాట్రిమోనిలో బయోడేటాను పోస్టు చేశాడు. 2023లో బాధితుడి నంబర్ ఒక మ్యాట్రిమోని గ్రూప్‌తో షేర్ చేయబడింది. అవతలి వ్యక్తి పేరు ఫాతిమా, తాను పాకిస్థాని నటి పర్వరీష్ షా ని అంటూ పరిచయం చేసుకుంది. అతను కూడా నమ్మాడు. అలా రూ.21.74 లక్షలు పోగొట్టుకున్నాడు. పర్వరీష్ షా తో పాటు ఫాతిమా సోదరినంటూ అనీసా ఎం.హుండేకర్ కూడా పరిచయం చేసుకుంది.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో విషాదం... కన్నబిడ్డల కోసం పోరాడిన ఓ తండ్రి విషాదగాథ
బాధితుడి బలహీనతలను గుర్తించిన వారు ఇరువురు వారి భావోద్వేగాలతో బాధితుడిని బుట్టలో వేసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని ఫాతిమా నమ్మించింది. తన తల్లి అనారోగ్యంతో ఉందని, వైద్య ఖర్చుల కు డబ్బు కావాలని కోరింది. ఎలాగు పెళ్లి చేసుకుంటుంది కదా అని నమ్మిన బాధితుడు మొదట కొంత మొత్తం పంపించాడు. వాటిని రెండు రోజుల్లోనే తిరిగి చెల్లించింది. దీంతో ఆ వ్యక్తి నమ్మాడు. మరోసారి మళ్లీ కావాలని అడిగింది. ఇలా దశలవారీగా రూ.21.74 లక్షలు ఇచ్చాడు. తర్వాత అతడి నంబరును బ్లాక్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : Portugal Roll Cloud: భూమి, ఆకాశం ఒక్కటవ్వడం చూశారా? - షాకింగ్ వీడియోస్
Also Read : నేటి నుంచి రెండో టెస్టు.. భారత జట్టులో భారీ మార్పులు?
crime news telangana | crime news telugu | ccs | crime news | Matrimony Scam | fake matrimony | pakistan | actress