E Nagaraniki emindi sequal: క్రేజీ కాంబో.. ఇద్దరు మాస్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో.. థియేటర్లు దద్దరుల్లే!

'ఈ నగరానికి ఏమైంది' మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న 'ENE REPEAT' లో విశ్వక్‌సేన్‌తో పాటు బాలకృష్ణ కూడా కనిపించనున్నట్లు సమాచారం. కామియో గెస్ట్ రోల్‌లో కొన్ని నిమిషాల పాటు బాలయ్య బాబు ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది.

New Update
Balakrishna&Vishwak sen

Balakrishna Vishwak sen

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' మూవీ 2018లో రిలీజై బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది. అయితే ఈ మూవీకి సీక్వెల్ త్వరలోనే రాబోతున్నట్లు మూవీ టీం ఇటీవల అనౌన్స్ చేశారు. విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేశ్ కాకుమాను ముఖ్య పాత్రల్లో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2018లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.

ఇది కూడా చూడండి:Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

బాలకృష్ణ ఒక స్పెషల్ రోల్‌లో..

దీనికి సీక్వెల్‌గా 'ENE REPEAT' పేరుతో రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్‌తో కలిసి కొన్ని నిమిషాల పాటు ఓ ఇంట్రెస్టింగ్ క్యామియోలో కనిపించే అవకాశం ఉందట. ఇదే కనుక జరిగితే థియేటర్లలో రచ్చే రచ్చ. 

ఇది కూడా చూడండి:మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!

ఇద్దరు మాస్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ప్రేక్షకులకు పండగే. విశ్వక్‌సేన్ బాలకృష్ణకు వీరాభిమాని. ఈ విషయాన్ని విశ్వక్‌సేన్ పలు సందర్భాల్లో తెలియజేశాడు. వీరిద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. కాబట్టి ఈ సినిమాలో తప్పకుండా బాలయ్య గెస్ట్ రోల్ ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చూడండి:Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. సురేష్ ప్రొడక్షన్స్,  ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి  సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కకుమాను - ఈ నలుగురు స్నేహితులు మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారు.  'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో వీరి కెమిస్ట్రీ, కామెడీ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాయి. 

Advertisment
తాజా కథనాలు