Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్లు డౌన్ .. ప్రభాస్ కూడా ఆదుకోలేడా!

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నప్ప చిత్రం కలెక్షన్లు డౌన్ అయ్యాయి. మొదటి రోజున ఈ చిత్రం రూ. 9.25 కోట్లు రాబట్టగా...సోమవారం రూ. 2.3 కోట్లు, మంగళవారం 1.46 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

New Update

Kannappa Box Office Collections:  భారీ అంచనాలతో జూన్ 27న  విడుదలైన మంచు విష్ణు  'కన్నప్ప'  వసూళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. వీకెండ్ వరకు బాగానే   రాబట్టినప్పటికీ సోమవారం భారీగా డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. సోమవారం రూ. 2.3 కోట్లకు పడిపోయాయి. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగి, కేవలం రూ. 1.75 కోట్లు  మాత్రమే వసూలు చేసిందని అంచనా. దీంతో  ఐదు రోజుల్లో 'కన్నప్ప' దేశవ్యాప్తంగా  రూ. 27.45 కోట్లకు వసూళ్లు రాబట్టగా..  ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకి పైగా గ్రాస్ సాధించిందని నివేదికలు చెబుతున్నాయి.  

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

బ్రేక్ ఈవెన్ ఎంత?

సాక్నిల్క్ నివేదిక  ప్రకారం.. కన్నప్ప మొదటి రోజు  రూ. 9.35 కోట్లు వసూళ్లతో  విష్ణు కెరీర్‌లోనే అత్యధిక  ఓపెనింగ్‌గా నిలిచింది. రెండో రోజు (శనివారం) రూ. 7.15 కోట్లు సాధించింది. ఆ తర్వాత మూడవ  రోజు (ఆదివారం)  రూ. 6.9 కోట్లు వసూలు చేసింది.  వీకెండ్ వరకు బాగానే వసూళ్లు రాబట్టినప్పటికీ సోమవారం నుంచి తగ్గుమొఖం పట్టాయి. 

అయితే ఈ సినిమాను దాదాపు  రూ. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో  బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, శివభక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా రూపొందించబడింది. విష్ణు మంచు ఈ చిత్రానికి కథను కూడా అందించారు. 

ఇది కూడా చదవండి:బరువును తగ్గించాలని తాపత్రయమా!! అయితే ఈ 30-30-30 ఫార్ములా ట్రై చేయండి

Advertisment
Advertisment
తాజా కథనాలు