Producer Sirish: తప్పైపోయింది.. మెగా అభిమానులు నన్ను క్షమించండి: నిర్మాత శిరీష్

ప్రొడ్యూసర్ శిరీష్ వెనక్కి తగ్గారు. రామ్ చరణ్, మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. చరణ్ గురించి చిన్న మాట దొర్లింది అది తన తప్పేనని ఒప్పుకున్నారు. చరణ్‌ను అవమాన పరచడం, కించపరచడం తన జన్మలో ఎప్పుడూ చేయనని ఓ వీడియోను రిలీజ్ చేశారు.  

New Update
Producer Sirish sorry to ram charan and mega fans

Producer Sirish sorry to ram charan and mega fans

రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఫ్లాప్ పై ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ పదే పదే ప్రస్తావన తేవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూవీతో తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని ప్రొడ్యూసర్ శిరీష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అంతేకాకుండా కోట్ల రూపాయలు నష్టపోయామని.. అయినా రామ్ చరణ్ కానీ, దర్శకుడు కానీ ఒక్క ఫోన్ కూడా చేయలేదని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ చిర్రెత్తిపోయారు. దీంతో నిన్న ఒక హెచ్చరిక ప్రకటన రిలీజ్ చేశారు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆ ప్రకటనలో రాసుకొచ్చారు. 

నన్ను క్షమించండి

దీనిపై ప్రొడ్యూసర్ శిరీష్ స్పందించారు. ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అనంతరం క్షమాపణలు చెబుతూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. ‘‘మా SVC సంస్థకు, రామ్ చరణ్, చిరంజీవికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మా మధ్య చాలా రిలేషన్‌షిప్ ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. ఆయనను అవమాన పరచడం కానీ, ఆయనను కించపరచడం కానీ, నా జన్మలో నేనెప్పుడూ చేయను.  

నేనిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి.. నేను క్షమాపణలు చెబుతున్నాను. రామ్ చరణ్‌కి కూడా క్షమాపణలు చెబుతున్నాను. ఆయనతో నాకున్న రిలేషన్‌ను నేను దూరం చేసుకోదలచుకోలేదు. ఎందుకంటే అభిమానుల బాధలు, ట్రోలింగ్ నేను అర్థం చేసుకోగలను. ఒక హీరోను అలా అనేటప్పుడు ఏ అభిమాని కూడా భరించలేరు. 

అయితే నేను అన్న ఇంటన్సన్ అలాంటిది కాదు. మాకున్న క్లోజ్‌నెస్ కారణంగానే మాట దొర్లాను తప్ప ఆయనను అవమాన పరచడం నా ఉద్దేశం కాదు. మాకు మెగా హీరోల అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి అనబంధం ఉన్న హీరోలను అవమానించే ముర్ఖుడిని కాదు.’’ అంటూ ఆ వీడియోలో తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు