/rtv/media/media_files/sArPMYu3YLq6dbjwJuYj.jpg)
ఆన్‌లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు పెద్దింటి ప్రభాకరాచార్యులు పేరుతో వైష్ణవ యాత్రాస్ అనే ఫేస్‌బుక్ పేజీని నడుపుతున్న వ్యక్తి శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనం టికెట్లు ఇప్పిస్తామని ప్రచారం చేస్తున్నట్లు గుర్తించి చర్యలు మొదలుపెట్టినట్లు అధికారులు తెలిపారు. నకిలీ వ్యక్తులు, వెబ్‌సైట్లను నమ్మి మోసపోకూడదని, అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.
ఇది కూడా చూడండి:Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు
TTD Announcement On Online Tickets
మరోవైపు తిరుమల భక్తులకు శుభవార్త చెప్పేందుకు TTD సిద్ధమైంది. ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో బీమా(insurance) సదుపాయం కల్పించాలని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి:Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!
'స్వామి దర్శనార్థం రోజూ సుమారు 70 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం, క్యూలైన్లు తదితర ప్రదేశాల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. నడక మార్గంలో అడవి జంతువుల దాడి లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు బీమా కల్పించాలని చేయాత అందించాలని టీటీడీ భావిస్తోంది. ఇప్పటికే తిరుమలలో ప్రమాదం బారిన పడి మృతి చెందిన వారికి TTD రూ.3 లక్షల వరకు చెల్లిస్తోంది. ఇందులో భాగంగానే అలిపిరి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి అలిపిరి వరకు భక్తులు చేరుకునే వరకు బీమాను కల్పించాలని చూస్తున్నాం' అని టీటీడీ అధికారి చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Also Read : ఛాతిపై కూర్చొని.. గొంతు కోసిన యువకుడు... వీడియోలు తీసిన జనం
Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!
tickets | latest-telugu-news | today-news-in-telugu | business news telugu | andhra-pradesh-news