/rtv/media/media_files/2025/07/02/jadcherla-mla-anirudh-reddy-2025-07-02-17-20-51.jpg)
MLA Anirudh Reddy:
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంపై మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాల్లే అని ఆయన ఆరోపించారు. ఆ కోవర్టులకు కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్‌లు కట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మంచిగ మాట్లాడితే ఆంధ్ర వాళ్లు మాట వినరని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.
Also Read : మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!
తెలంగాణలో చంద్రబాబు నాయుడు కోవర్టులు ఉన్నరు.!
— Telugu Reporter (@TeluguReporter_) July 2, 2025
ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్ల కాంట్రాక్టులు.. హైదరాబాద్ ల దందాలు అన్నీ వాళ్లయే.
- జడ్చర్ల ఎమ్మెల్యే, అనిరుధ్ రెడ్డి#AnirudhReddy#Banakacharla#ChandrababuNaidupic.twitter.com/8SP0qbcGgZ
Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఓ సూచన చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్లు రాయడం కాదు. సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) కోవర్టులు తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాల్లే. ఆ కోవర్టులకు కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్‌లు కట్ చేయాలని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పైసలు ఒక్క రూపాయి ఇవ్వకండి. వాల్లే చంద్రబాబు వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకొని బనకచర్ల బంద్ చేయిస్తారని ఆయన అన్నారు. మంచిగ మాట్లాడితే ఆంధ్ర వాళ్లు మాట వినరు’ అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....